English Version
  8 Oct, 2017
Home / Big Poster / చంద్రబాబు ఇంటికి టీఆర్ఎస్ మంత్రి.!

చంద్రబాబు ఇంటికి టీఆర్ఎస్ మంత్రి.!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : అది జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 65. అదే రోడ్డులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంది. ఆదివారం ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేతలు ఓ 20 మందితో ఆయన సమావేశమయ్యారు. ఓ వైపు సమావేశం సీరియస్ గా నడుస్తూ ఉంది. మీడియా ప్రతినిధులు న్యూస్ కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో కుయ్ కుయ్ మంటూ ఓ కాన్వాయ్ ఆ రోడ్డులోకి ప్రవేశించింది. బాబు నివాసం వద్ద ఉండే సెక్యూరిటీ గేట్ ( దీనిని బీబీ-1 అని సంభోదిస్తారు) వరకూ వచ్చేసింది. ఒక్క సారిగా గేట్ వద్ద పైలెట్ వెహికిల్ వచ్చి ఆగింది. ఇంతలో మీడియా ప్రతినిధులు ఉలిక్కి పడ్డారు. ఈ కాన్వాయ్ ఎవరిదా అని కార్ల వద్దకు పరుగులు పెట్టారు. ఆ కారు ఓ మంత్రిది అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే, కార్ డ్యాష్ బోర్డు పై టీఆర్ఎస్ గులాబీ కండువా కనిపించడంతో మీడియా ప్రతినిధుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

అంతలో సదరు మంత్రి కారు అద్దం దించి, అటు కాదు…ఇటు పోనివ్వండి అంటూ పైలెట్ వెహికిల్ సిబ్బందికి మార్గ నిర్ధేశం చేయడం కనిపించింది. ఆయనే టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బాబు ఇంటికి వచ్చారేమిటీ అని మీడియా ప్రతినిధులు మంత్రిని ప్రశ్నించారు. తాను బాబు ఇంటికి రాలేదని, రోడ్ నెంబర్ 36కు వెళ్లబోయి ఇటు వచ్చానని, మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ వల్ల ఇటు వైపు వచ్చానని, చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న విషయం తనకు తెలియదని ఆయన వివరణ ఇచ్చి వెళ్లిపోయారు. ఆ విషయం అటుంచితే తలసాని వివరణ పై మీడియా ప్రతినిధుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంత్రి కాన్వాయ్ కి ట్రాఫిక్ సమస్య ఎందుకుంటుందన్నది ప్రశ్న. అదీ ఆదివారం ఈ ఏరియాలో ఎప్పుడూ ట్రాఫిక్ ఉండదు. పోని ఆ రోడ్డులో చంద్రబాబు ఇల్లు ఉంటుందని తలసానికి తెలియదనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే టీడీపీ నేతగా రెండేళ్ల క్రితం వరకు తలసాని నిత్యం ఆయన ఇంటికి వస్తుండే వారు.
చంద్రబాబు గత 30 ఏళ్ల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. అదే స్థలంలో పాత ఇల్లు కూలగొట్టి ఇటీవల కొత్త ఇల్లు నిర్మించుకున్నారు బాబు. ఇవన్నీ మంత్రికి తెలుసు. అయినా అటువైపు రావడం పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వ్యక్తిగత వ్యవహారంలో బాబును కలిసేందుకు వచ్చారా!? మీడియా ఉండటంతో అది సరైన సమయం కాదని డైవర్ట్ అయి వెళ్లిపోయారా? లేక ఆయన చెబుతున్నట్టు నిజంగానే దారితప్పి వచ్చారా!? అంటే…ఏమో!!

Your Comments / Feedback