English Version
  20 Mar, 2019
Home / Latest News / స్టేట్ లో ఎలాగు తుస్సంది..మరి సెంట్రల్ లో..?

స్టేట్ లో ఎలాగు తుస్సంది..మరి సెంట్రల్ లో..?

For Advertisements, Contact here : 8074030036

గులాబీ బాస్ చెప్పినట్లే సెంచరీ కొట్టాడు. భయపెట్టో..లాలించో తాను అనుకున్నది సాధించాడు..అవును టీఆర్ఎస్ అనుకున్నట్లు 100 ఎమ్మెల్యే సీట్లను కొల్లగొట్టింది. అదేంటి ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 88 సీట్లే సాధించింది అనుకుంటున్నారా..సొంతంగా గెలిచింది అంతేమరి..కాకపోతే మిగితా పార్టీల్లో గెలిచినవారు ఉన్నారుగా..వారిని మెల్లగా లాగేశారు. ఎలాగైతేనేం సెంచరీ కొట్టారు.

కాకాపోతే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయడం దారుణం.. ప్రజల గొంతుకకగా పనిచేసే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తూ అందిరినీ తమ పార్టీలోకి లాగేస్తున్న గులాబీ బాస్.. అసలు ప్రజానికానికి ఏం మెస్సేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మరి.. గతంలో పార్టీ ఫిరాయించడం సిగ్గుచేటని కల్లబొల్లి కబుర్లు చెప్పిన కేసీఆర్..ఇప్పుడు వాటిని ప్రోత్సహించడం శోచనీయం.

ఇప్పటికే కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోయే స్థితికి చేరింది. ఆ పార్టీ వారందరికి కండువాలు కప్పుతూ..కారు ఫుల్ లోడ్ తో దూసుకెళ్తుంది. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ కూడా కారెక్కేందుకు రెడీ అయిపోయారు. అందరిలాగే ఆయన కూడా నియోజకవర్గ అభివృద్ధి అంటూ గులాబీ గూటికి చేరారు. ఇప్పుడిక అసెంబ్లీలో టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. వారు చెప్పిందే వేదం..చేసేదే చట్టం.. ఇదే స్పీడ్ లో పార్లమెంట్ ఎన్నికలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని టీఆర్ఎస్ గట్టిగా కసరత్తు చేస్తోంది. అయితే కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ శథవిధాల ప్రయత్నిస్తోంది. గట్టి అభ్యర్ధులను ఎంపీ బరిలోకి దింపి కారుకు సవాల్ కొడుతోంది. స్టేట్ లో ఎలాగు పోయింది..సెంట్రల్ లోనైనా పాగా వేయాలని ప్లాన్ వేస్తొంది.

Your Comments / Feedback