English Version
  25 Mar, 2019
Home / Latest News / యూటర్న్ తీసుకున్న టీఆర్ఎస్..స్టార్ క్యాంపెయినర్ జాబితాలో హరీష్ రావు

యూటర్న్ తీసుకున్న టీఆర్ఎస్..స్టార్ క్యాంపెయినర్ జాబితాలో హరీష్ రావు

For Advertisements, Contact here : 8074030036

పార్టీ నుండి హరీష్ రావును పొమ్మనలేక పొగపెడుతున్నారు గులాబీ బాస్. ట్రబుల్ షూటర్ కాస్త ఇప్పుడు డీప్ ట్రుబుల్స్ లో పడ్డాడు. ఆయనను పార్టీలో పట్టించుకున్నవారే కరువయ్యారు. పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి..తన టాలెంట్ తో గట్టేక్కించిన హరీష్ రావుకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండే హరీష్ రావును పక్కనబెట్టగా..కెబినెట్ తో పాటు కీలక మీటింగులలో హరీష్ రావు కననబడడం గగనమైపోయింది.

మొదట టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో హరీష్ కు చోటు దక్కలేదు..కాదు కాదు ఆయనను కావాలనే జాబితా నుండి తప్పించారు. మామూలు లీడర్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన టీఆర్ఎస్.. అసలు స్టార్ అయిన హరీష్ రావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో కార్యకర్తలు, హరీష్ అభిమానుల నుండి అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడడంతో టీఆర్ఎస్ యూటర్న్ తీసుకుంది. చివరకు హరీష్ రావును స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చింది.

అయితే తన కొడుకు సీఎం కాకుండా హరీష్ రావు ఎక్కడ అడ్డు వస్తాడో అని కేసీఆర్ కావాలనే హరీష్ ను దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించగానే ఒక్క సారిగా పార్టీలో వాతావరణం వేడెక్కింది. కుమారునికి పార్టీ పదవులిచ్చారు బాగానే ఉంది… మరి ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదలకు కోసం అహోరాత్రులు శ్రమించిన మేనల్లుడు హరీష్ రావు పరిస్థితి ఏంటనే సందేహాలు మొదలయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కేసిఆర్ వెన్నంటి ఉండి నడిచింది ఒకే ఒక్కడు హరీశ్ రావు. కేసిఆర్ తర్వాత తెలంగాణ సీఎం అయ్యే అన్నీ అర్హతలు ఉన్న వ్యక్తి కూడా హరీశ్ రావే. అందుకే ఆయనకు పార్టీలో చెక్ పెడుతూ..కేటీఆర్ ని గద్దెపై కూర్చోబెట్టారు. ఇంత జరుగుతున్న హరీష్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ టైం నడుస్తోంది.. చూద్దాం ముందు ముందు టీఆర్ఎస్ లో హరీష్ రావు ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో..

Your Comments / Feedback