English Version
  27 Mar, 2019
Home / Latest News / ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖంగుతిన్న కారుపార్టీ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖంగుతిన్న కారుపార్టీ

For Advertisements, Contact here : 8074030036

ఎన్నికల్లో గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్న టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. మిగిత పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకుని 100 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ని చేరుకున్న గులాబీ పార్టీ..ఎంపీ ఎన్నికలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. అయితే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి ఝలక్ తగిలింది. దీంతో కారుపార్టీ ఖంగుతిన్నది.

కరీంనగర్‌, నల్లగొండ ఉపాధ్యాయ, కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన పాతూరి సుధాకర్‌ రెడ్డి ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. ఆయన ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల వల్లే టీఆర్ఎస్ గెలిచిందని తాము చెబుతున్నది నిజమైందని అంటోంది కాంగ్రెస్. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడం వల్లే తామ గెలుపు సాధ్యమైందని చెబుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ అధికారిక అభ్యర్థులు కారని టీఆర్ఎస్ చెప్పుకొచ్చింది. ఏదేమైన ఎంపీ ఎన్నికల ముంగిట టీఆర్ఎస్ కు ఇది షాకింగ్ న్యూసే.

Your Comments / Feedback