English Version
  10 Mar, 2018
Home / All in one / ష‌మీ బ‌తుకు బ‌స్టాండ్ చేస్తున్న భార్య‌

ష‌మీ బ‌తుకు బ‌స్టాండ్ చేస్తున్న భార్య‌

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం:
టీమ్‌లో నిల‌దొక్కుకోలేక ఇబ్బంది ప‌డుతున్న టీమిండియా బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి కాపురంలో కుంప‌ట్లు మ‌రి సెగ రాజేస్తున్నాయి. ముఖ్యంగా వివాహేత‌ర సంబంధాలు, గృహ‌హింస‌కు పాల్ప‌డుతున్నాడంటూ ష‌మీ భార్య హ‌సీన్ పోలీసు స్టేష‌న్‌కు వెళ్లింది. కేసు పెట్టింది. ఇపుడు ఈ కేసు మ‌రింత ముదురుతోంది. ఇప్ప‌టికే ష‌మీ పాకిస్తాన్ మ‌హిళ ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకున్నాడ‌ని, ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని కూడా ఆరోపించింది ఆయ‌న భార్య‌. ఇపుడు మ‌రో అడుగు ముందుకేసి… త‌న సోద‌రుడితో కూడా ప‌డ‌క పంచుకోవాల‌ని ష‌మీ త‌న‌ను బ‌ల‌వంతం చేశాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది హ‌సీన్ జ‌హాన్‌. అంతేకాదు.. త‌ర్వాత అత‌ని సోద‌రుడు త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది. ఈ కామెంట్స్ తో ష‌మీ బ‌తుకు బ‌స్టాండ్ అయ్యేలా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే బీసీసీ కంట్రాక్ట్ నుంచి ష‌మీని ప‌క్క‌న పెట్టింది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ష‌మీ భ‌విత‌వ్యం తేల్చనుంది. ఇపుడు నాలుగు గోడ‌ల మ‌ధ్య లొల్లి బ‌జారున ప‌డ‌టంతో ష‌మీకి చిక్కులు త‌ప్పేలా లేవు. మ‌రోవైపు అత‌నిపై గృహ‌హింసతో పాటు అటెమ్ట్ టూ మ‌ర్డ‌ర్ కేసులు కూడా న‌మోద‌య్యాయి. త్వ‌ర‌లో ష‌మీని పోలీసులు అరెస్ట్ చేసే అవ‌కాశం కూడా ఉందంటున్నారు. మొత్తంగా టీమ్‌లోకి పున‌రాగ‌మ‌నం చేయాల‌నుకుంటున్న ష‌మీకి భార్య తీసుకొచ్చిన చిక్కులు మ‌రింత ఇబ్బందుల్లో ప‌డేశాయి. తాజా మ‌హిళ‌ల‌తో ష‌మీ కాల్ రికార్డింగ్స్ హ‌సీన్ బ‌య‌ట‌పెట్టింది. దీంతో క‌ట్టుకున్న భార్యే ష‌మీని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Your Comments / Feedback