English Version
  24 Mar, 2019
Home / Latest News / రేవంత్‌ ను ఓడించేందుకు స్కెచ్…కారు పంక్చర్ అవడం ఖాయమే

రేవంత్‌ ను ఓడించేందుకు స్కెచ్…కారు పంక్చర్ అవడం ఖాయమే

For Advertisements, Contact here : 8074030036

గులాబీ పార్టీకి మళ్లీ గబులు పట్టుకుంది. ఆ గుబులు పేరే రేవంత్ రెడ్డి. అవును కోడంగల్ లో పక్కా స్కెచ్ తో రేవంత్ ను దెబ్బకొట్టిన కారు పార్టీ..ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేయాలని ప్లాన్ వేస్తోంది. రేవంత్ గెలిస్తే మళ్లీ తమని ఎక్కడ ఉతికి ఆరేస్తాడో అని టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు కీలక నేతను రంగంలోకి దించుతోంది. ఎలాగైన గెలిచేందుకు టీఆర్ఎస్ నానా ప్రయత్నాలు చేస్తోంది.

కొడంగల్ ఓటమికి మల్కాజ్ గిరిలో గెలిచి టీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి… తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. అయితే ఆయనను ఓడించే బాధ్యతను కేటీఆర్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓటమిలో హరీశ్ రావు కీలకపాత్ర పోషించగా..ఇప్పుడు కేటీఆర్ మల్కాజ్ గిరి గ్రౌండ్ లోకి దిగుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టిన కేటీఆర్… మల్కాజ్‌గిరి లోనూ అదే రేంజ్‌ విక్టరీ అందిస్తారని కారు పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. .

రేవంత్ రెడ్డిని ఓడిస్తే…మరో నాలుగేళ్లు అతడిని సైలెంట్ చేయొచ్చన్నది టీఆర్ఎస్ ప్లాన్. కానీ అక్కడ ఉన్నది రేవంత్..అసెంబ్లీ ఎన్నికల్లాగా చేయాలనుకుంటే కారు పంక్చర్ కావడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే అన్ని వర్గాల నాయకులను కలుస్తూ..రేవంత్ మంచి ఊపు మీద ఉన్నారు. ఇప్పుడు ఆయనను అడ్డుకోవడం అంటే కారుకు కష్టమే. ఈ సారి మాత్రం గులాబీదళానికి రేవంత్ ఇచ్చే ఝలక్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ..

Your Comments / Feedback