English Version
  4 Feb, 2019
Home / All in one / జ‌య‌రాం హ‌త్య‌లో కొత్త కోణం… టీడీపీ నేత‌ల‌కు అంటుతోన్న నెత్తుటి మ‌ర‌క‌లు ?

జ‌య‌రాం హ‌త్య‌లో కొత్త కోణం… టీడీపీ నేత‌ల‌కు అంటుతోన్న నెత్తుటి మ‌ర‌క‌లు ?

For Advertisements, Contact here : 8074030036

పారిశ్రామికవెత్త జ‌య‌రాం హ‌త్య కేసులో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డుతోంది. హైద‌రాబాద్ లో జ‌య‌రాం ను హ‌త్య చేశాన‌ని… ఆవేశంలో చేయిచేసుకోవ‌టంతో జ‌య‌రాం చ‌నిపోయాడంటూ వార్త‌లు బ‌య‌ట‌కు వ‌స్తోన్ననేప‌థ్యంలో…. ఓ చాన‌ల్ క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా మారింది.

రాకేశ్ రెడ్డికి టీడీపీ నేత‌ల‌తో స‌త్సంబంధాలున్నాయ‌ని, మొన్న‌టి మ‌హ‌కూట‌మి టికెట్ల కేటాయింపులో టీడీపీ ఆశావాహుల నుండి కొంతమేర డ‌బ్బు కూడా వ‌సూలు చేశార‌న్నఆరోప‌ణ‌లున్నాయి. గతంలో చంద్ర‌బాబుతో రాకేశ్ రెడ్డి ఉన్న ఫోటోల‌ను కూడా బ‌య‌ట‌పెట్టిన స‌ద‌రు చాన‌ల్… రాకేశ్ రెడ్డి వ్య‌వ‌హ‌రంలో ఓ ఏపీ మంత్రి ఉన్నాడ‌ని పేర్కొంది. అందుకే స‌ద‌రు మంత్రి అండ ఉంటుంద‌న్న న‌మ్మ‌కంతోనే రాకేశ్ రెడ్డి జ‌య‌రాం మృత‌దేహాన్ని గుడివాడ ప‌రిస‌ర ప్రాంతాల వ‌ర‌కు కారులో తీసుకెళ్లి ప‌డేశాడ‌ని, హైద‌రాబాద్ లో ఉంటే కేసు త‌మ మెడ‌కు చుట్టుకుంటుంద‌ని ఊహించే ఇదంతా చేశార‌ని అభిప్రాయ‌ప‌డింది. అయితే… ఇదే రాకేశ్ రెడ్డి పై గ‌తంలో చీటింగ్ కేసులు, వ్య‌భిచార కేసులు కూడా ఉండ‌టం…. రాకేశ్ రెడ్డి గ‌త సంబందాలు చూస్తే టీడీపీ నేత‌ల‌కు చ‌నువుగా ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంద‌ని తెలుస్తోంది.

ఇందుకు జ‌య‌రాం స‌తీమ‌ణి ప‌ద్మ‌శ్రీ వాఖ్య‌లు కూడా బ‌లం చేకూరుస్తున్నాయి. త‌న భ‌ర్త‌కు బ‌య‌టి వారితో క‌న్నా… సొంత అక్క‌, అక్క కూతురు శిఖా చౌద‌రితోనే ప్రాణ‌హ‌ని ఉండేద‌ని పేర్కొన‌టం…. మొత్తం ఇష్యూ రాకేశ్ రెడ్డి మెడ‌కు చుట్టేసి, అస‌లు నిందితుల‌ను దాచే ప్ర‌య‌త్నం న‌డుస్తోందా…అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

Your Comments / Feedback