English Version
  26 Sep, 2017
Home / All in one / సికింద్రాబాద్ బరిలో ‘తెలంగాణ యోగి!!’ ‘పోస్టర్’ ఎక్స్ క్లూసివ్ రిపోర్ట్.

సికింద్రాబాద్ బరిలో ‘తెలంగాణ యోగి!!’ ‘పోస్టర్’ ఎక్స్ క్లూసివ్ రిపోర్ట్.

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన లాగే ఇప్పుడు రాజాసింగ్ కూడా లోక్ సభకు వెళ్లాలనుకుంటున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నుంచి ఈ సారి బరిలో దిగేందుకు రాజా రెడీ అయిపోతున్నారు. బీజేపీ టికెట్ ఇస్తే సరే లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా రంగంలోకి దిగాల్సిందేనని డిసైడయ్యారట రాజాసింగ్. దీనికోసం ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. డివిజన్ కు 200 మంది మెరికల్లాంటి కుర్రాళ్లను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ సారి లోక్ సభకు వెళ్లడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించాలని రాజాసింగ్ ఆలోచన చేస్తున్నారు. యోగీని ఆదర్శంగా తీసుకున్న రాజాసింగ్ ఆయన కార్యాలయంలో మొత్తం ఆదిత్యనాథ్, బాల్ థాకరే పోస్టర్లతో నింపేశారట. హిందుత్వ సిద్ధాంతంతో ఎదిగిన రాజాసింగ్ ఇక ముందు కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారట. ప్రస్తుతం బీజేపీ తరపున సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆ స్థానం పై బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆ స్థానం పై కన్నేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే…రాజాసింగ్ మాత్రం చాపకింద నీరులా ఎన్నికల సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు.

Your Comments / Feedback