English Version
  21 Mar, 2019
Home / Latest News / ఢీ అంటే ఢీ అంటున్న మెగా, నందమూరి మొన‌గాళ్లు

ఢీ అంటే ఢీ అంటున్న మెగా, నందమూరి మొన‌గాళ్లు

For Advertisements, Contact here : 8074030036

ఇన్నాళ్లు సినిమాల్లో సై అంటే సై అంటూ త‌ల‌ప‌డ్డాయి మెగా, నంద‌మూరి కుటుంబాలు. ఇద్దరి మధ్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంట్రెస్టింగ్ వార్ న‌డిచేది. అయితే ఇప్పుడు ప్లేస్ మారింది. సినిమాలు కాస్త పాలిటిక్స్ అయ్యాయి. రాష్ట్ర రాజ‌కీయం పుట్టిందే మా ఇంట్లో..మేం అడ్డొస్తే ఢీ కొట్టెదెవరు అంటూ అప్ప‌ట్లో డైలాగులతో మోత మెగించాడు బాల‌య్య‌. పైగా నంద‌మూరి కుటుంబానికి రాజ‌కీయాలు కొత్త కావు..ఎన్టీఆర్ నుండి బాలయ్య వరకు రాజకీయాల్లో రాణిస్తున్నారు

అయితే మెగా ఫ్యామిలీకి మాత్రం రాజ‌కీయాలు కొత్తే. ప‌దేళ్ల కింద ప్ర‌జారాజ్యం పార్టీతో తొలిసారి రాజ‌కీయాల్లో అడుగుపెట్టారు మెగా హీరోలు..అయితే ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో..పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి తట్టాబుట్టా సర్దుకున్నారు. ఇక ఆ తర్వాత పవన్ మళ్లీ జనసేనతో ప్రజల ముందుకు రావడంతో.. ఇప్పుడు మెగా నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు న‌డుస్తుంది.

గత ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచిన బాలయ్య..ఇప్పుడు కూడా అక్కడి నుండే ఎన్నికల బరిలో దిగుతున్నాడు. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీకి రెడి అయ్యాడు. ఇక తాజాగా అన్న నాగ‌బాబు కూడా జ‌న‌సేన‌ కండువా కప్పుకుని..న‌ర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అంతేకాదండోయ్ ఎన్నికల బరిలో తాముకూడా ఉన్నామంటున్నారు బాల‌య్య అల్లుళ్లు లోకేష్, భ‌ర‌త్. ఇలా రెండు కుటుంబాల నుంచి ఎవ‌రికి వారే త‌మ స‌త్తా చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇన్నాళ్లూ సినిమాల్లో ఢీ అంటే ఢీ అన్న వీరు ఇప్పుడు పాలిటిక్స్ లో తొడలు కొట్టుకుంటుండడంతో అభిమానుల్లో ఆస‌క్తి నెలకొంది

Your Comments / Feedback