English Version
  27 Mar, 2019
Home / Latest News / బుసలు కొడుతున్న కట్టల పాములు.. ఎంతిచ్చేందుకైనా రెడీ అంటున్న అభ్యర్ధులు

బుసలు కొడుతున్న కట్టల పాములు.. ఎంతిచ్చేందుకైనా రెడీ అంటున్న అభ్యర్ధులు

For Advertisements, Contact here : 8074030036

ఎన్నికలు వచ్చాయంటే చాలు నోట్ల కట్టలు పడగవిప్పుతాయి. మందుకు, విందుకు డోకా ఉండదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం ఏరులై పారగా..ఇఫ్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా కట్టల పాములు బుసలు కొడుతున్నాయి. మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులే. తమ గెలుపు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

ఇక అధికార టీఆర్ఎస్ కచ్చితంగా 16 సీట్లు గెలుస్తామని ఢంకా బజాయించి చెబుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం తయారయింది.. ఈ పరిస్థితుల్లో పరువు నిలుపుకోవాలంటే… ఎన్నికల్లో గెలవాల్సిందే..పార్టీల సంగతి పక్కనబెడితే అభ్యర్ధులు మాత్రం ఎంత మనీ పంచేందుకైనా రెడి అంటున్నారు.

కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, నల్గొండ, వరంగల్, ఖమ్మం లోక్ సభ స్థానాల్లో వందల కోట్లు ఖర్చు చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలు బిజినెస్ మ్యాన్ లనే బరిలోకి దింపింది. వారైతే ఎంతైనా ఖర్చు చేస్తారనేది పార్టీల ప్లాన్. ఒక్కో ఓటుకూ రూ.5 వేలైనా ఇచ్చేందుకు అభ్యర్థులు సై అంటున్నారు.

తెలంగాణలో మొత్తం 15 లోక్ సభ నియోజకవర్గాల్లో 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే టైంలో ఈసీ కూడా రంగంలోకి దిగుతోంది. ప్రధాన ప్రత్యర్థులెవరు, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఆర్థిక బలమెంత వంటివి అంశాల్ని పరిశీలిస్తోంది. ఈసీ ఎన్ని చర్యలు తీసుకున్న డబ్బు పంపిణీ మాత్రం ఆగదనే చెప్పాలి.

Your Comments / Feedback