English Version
  19 Mar, 2019
Home / All in one / కష్టాల నుండి తమ్ముడిని గట్టెంక్కించిన ముఖేష్ అంబానీ

కష్టాల నుండి తమ్ముడిని గట్టెంక్కించిన ముఖేష్ అంబానీ

For Advertisements, Contact here : 8074030036

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఎవరి వ్యాపారం వారిదే..ఎవరి లెక్కలు వారివే. అన్న మస్తుగా ఆస్తులు సంపాదిస్తూ దూసుకెళ్తుంటే..తమ్ముడు మాత్రం అప్పుల ఊబిలో చిక్కుకుని కిందా మీదా పడుతున్నాడు. ఎరిక్ సన్ అనే సంస్థకు 550 కోట్లు చెల్లించాలని సుప్రీం ఆర్డరేసింది. లేకపోతే జైలుకెళ్లాల్సిందేనని తేల్చిచెప్పింది. అసలే అప్పులతో సతమతమవుతున్న అంబానీకి ఇది తలకు మించిన భారంగా మారింది. వాటిని ఎలా కట్టాలో తెలిక నానా తంటాలు పడ్డాడు..

అయితే ఎంతైన తమ్ముడు కదా..అందుకే ముఖేష్ అంబానీ రంగంలోకి దిగాడు. తమ్మున్ని ఎలాగోలా గట్టెక్కించాడు. దీంతో అనిల్ అంబానీ తనకొచ్చిన కష్టం నుంచి రిలీఫ్ అయ్యాడు. కష్టకాలంలో తనకు సాయం చేసిన..అన్న వదినకు థ్యాంక్స్ చెప్పాడు అనిల్. కష్టసమయంలో నా వెన్నంటి నిలబడిన మా అన్న ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బలమైన కుటుంబ బంధాలను, విలువలను చాటిచెప్పడంతో పాటు సరైన సమయంలో సహకారం అందించారంటూ తెగ పొగిడేశాడు.

ఇక రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయిన తర్వాత అనిల్ అంబానీని ముఖేష్ అంబానీ ఆదుకోవడం ఇది రెండోసారి. 2018లో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన 3 వేల కోట్ల విలువైన వైర్‌లెస్ సామగ్రిని జియో ఇన్ఫోకామ్ కొనుగోలు చేసింది. అయితే జియో ఎంటరైన తర్వాత..ఆర్‌కామ్ ఆర్థిక ఇబ్బందులకు గురైంది. ఏదైతేనేం తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు అన్న ఆదుకోవడం చెప్పుకోదగ్గ విషయమే

Your Comments / Feedback