English Version
  21 Mar, 2019
Home / Latest News / కూతురు మినిస్టర్..కొడుకు సీఎం..వారెవ్వా కేసీఆర్ ప్లాన్

కూతురు మినిస్టర్..కొడుకు సీఎం..వారెవ్వా కేసీఆర్ ప్లాన్

For Advertisements, Contact here : 8074030036

గులాబీ బాస్.. నిర్ణయాలు ఊహకు అందనవి. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో సన్నిహితులు కూడా ఊహించలేరు. సంచలన నిర్ణయాలు తీసుకోవడం… వాటిని సక్సెస్ ఫుల్ గా అమలుచేయడంలో కేసీఆర్ దిట్ట. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు… ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నారు కేసీఆర్. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కరీంనగర్ సభలో వినోద్ కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్…నిజామాబాద్‌ సభలో మాత్రం కవిత పేరును ప్రకటించలేదు. దీంతో పలు సందేహాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ మదిలో మరో ఆలోచన ఉందని… అందుకే కవితను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించలేదని తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి కవిత భర్త అనిల్‌ను ఎంపీగా బరిలోకి దింపాలనుకుంటున్న కేసీఆర్… ఆమెకు మినిస్టర్ పదవి ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్నారు.

ఇంతకుముందే ఇద్దరి మహిళలను కేబినెట్ లోకి తీసుకుంటామని చెప్పిన కేసీఆర్..కవితను దృష్టిలో పెట్టుకునే అలా అనట్లు ఇన్ సైడ్ టాక్. ఏదిఏమైనా…నిజామాబాద్ వేదికగా కేసీఆర్ కవితను మరోసారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం అనేక సందేహాలకు తెరలేపింది. హరీష్ రావును ఎప్పుడో సైడ్ చేసిన కేసీఆర్ ఇఫ్పుడు కూతురిని మంత్రిని చేయడం ఊహించిందే. ఇంకేముంది కూతురుని మినిస్టర్, కొడుకుని సీఎం చేసి కేసీఆర్ హాయిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే టైం దగ్గర్లోనే ఉంది. అదేంటీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాన్నారుగా అంటారు.. అంతవరకు ఎందుకు లేండి..లైట్ తీసుకోండి. ఫామ్ హౌస్ కు ఫిక్స్ అయిపోండి.

Your Comments / Feedback