English Version
  6 Oct, 2017
Home / Big Poster / కేసీఆర్ కోసం దేవినేని ఉమా పడిగాపులు!

కేసీఆర్ కోసం దేవినేని ఉమా పడిగాపులు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పది నిముషాలు పడిగాపులు పడ్డారు. సుప్రీం కోర్టు జడ్జీ ఎన్వీ రమణ కుమార్తె పెళ్లి వేదిక వద్ద ఈ దృశ్యం కనిపించింది. వీఐపీ గేటు వద్ద కేసీఆర్ ను రిసీవ్ చేసుకున్న ఉమా వేదిక వరకు ఆయనను అనుసరించారు. కేసీఆర్ వేదిక పైకి వెళ్లి అక్షితలు వేసి రావడానికి పది నిముషాలు పట్టింది. అంత సేపూ వేదిక దిగువన ఉమా ఎదురు చూస్తూ గడిపారు. కేసీఆర్ దిగి రాగానే ఆయనను కారు వరకు సాగనంపారు ఉమా. ఈ దృశ్యం చూసిన పెళ్లికి హాజరైన అతిథులు ముక్కున వేలేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగుంటుందన్న దానిపై అక్కడే ఉన్న టీడీపీ నేతలు సెటైరిక్ గా మాట్లాడటం గమనార్హం. ఎవరైనా దీనిపై ఉమాను కదిలిస్తే…’రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పై మాట్లాడాం’ అని చెబుతాడంటూ టీడీపీ నేతలు జోకులు వేసుకోవడం వినిపించింది. అన్నట్టు…గతంలో ఈ ఉమాను ఉద్దేశించే కేసీఆర్..”ఉమా అంటే ఆడా మగా!?” అని ఎద్దేవా చేశారు.
ఇక ఈ పెళ్లికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె కవిత కూడా ఉన్నారు. కేసీఆర్ రాకను గమనించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పరుగు పరుగున వెళ్లారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. కేసీఆర్ వచ్చి వెళ్లాక 20 నిముషాలకు చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చారు. అక్షితలు వేసి వేదిక దిగిన చంద్రబాబు ఓ 20 నిముషాలు అక్కడే గడిపారు. ఈ వేడుకలో సుప్రీం కోర్టు జడ్జీలు పెద్దగా కనిపించలేదు. రాజకీయ నాయకులు, ఐపీఎస్ అధికారు ఎక్కువ మంది దర్శనమిచ్చారు.

Your Comments / Feedback