English Version
  18 Mar, 2019
Home / Black & White / సైలెంట్ గా పని కానిచ్చేసిన ఇండియా.. చైనాకు ఝలక్

సైలెంట్ గా పని కానిచ్చేసిన ఇండియా.. చైనాకు ఝలక్

For Advertisements, Contact here : 8074030036

అవును ఇండియా సైలెంట్ తన పని తాను చేసుకపోయింది. ఇది ఒకేసారి కాదులేండి. ఫిబ్రవరీ 17 నుంచి మార్చి 2వరకు తాపీగా చేసుకుంటూ వెళ్లింది. ఇంతకీ అది ఎక్కడ.. ఏంటీ అంటారా.. మయన్మార్, ఇండియా సరిహద్దుల్లో నిర్మిస్తున్న కలాదాన్‌ ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి అకారన్‌ ఆర్మీ అనే ఉగ్ర సంస్థ కుట్ర పన్నింది. ఈ సంస్థకు చైనా సపోర్టు కూడా ఉందిలేండి. ఈ కుట్రపై భారత ఇంటెలిజెన్స్‌ కు ఉప్పందింది.

దీంతో ఇరు దేశాల సైనికులు రంగంలోకి దిగి 12 ఉగ్ర స్థావరాలను వాష్ అవుట్ చేశాయి. ఇంత జరిగిన చైనా సైలెంట్ గా ఎందుకుందంటారా..మనం బార్డర్ దాటలేదు. పైగా ఆ ఉగ్ర సంస్థలు మయన్మార్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. అందుకే వాటిని ఇండియా సహాయంతో నామరూపాల్లేకుండా చేసింది. దీంతో చైనా కూడా కిమ్మనడం లేదు.

అసలు ఈ కలాధాన్ ఎందుకంటే కోల్‌కతా నుండి మిజోరాంకు సరుకులు తీసుకెళ్లాలంటే..బంగ్లాదేశ్ చుట్టూ తిరిగి వెళ్లాలి. అందుకే ఈ ప్రాజెక్టుకు ఇండియా శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోల్‌కతాలోని భారత ఓడరేవును మయన్మార్‌లోని సిత్‌వే ఓడరేవుతో అనుసంధానం చేస్తుంది.. దీంతో కోల్‌కతా నుంచి మిజోరం మధ్య దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం, నాలుగు రోజుల ప్రయాణ సమయం తగ్గుతుంది. అయితే దీనిపై ఉగ్రవాదుల కన్ను పడింది. ఎలాగైన ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండా చేయాలని ప్లాన్ వేశాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఇరుదేశాలు ఉగ్రస్థావరాలను మట్టిలో కలిపేశాయి.

Your Comments / Feedback