English Version
  25 Mar, 2019
Home / Latest News / కేసీఆర్ కూతురుకు పసుపు ఫీవర్..ఎన్నిక వాయిదా పడుతుందా..

కేసీఆర్ కూతురుకు పసుపు ఫీవర్..ఎన్నిక వాయిదా పడుతుందా..

For Advertisements, Contact here : 8074030036

రైతులు కేసీఆర్ కూతురుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పసుపు, ఎర్రజొన్న రైతుల వల్ల కవిత నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఎన్నికల్లో గెలుపు తర్వాత.. రైతుల దెబ్బకు అసలు ఎన్నిక జరుగుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది. తమ సమస్యను దేశవ్యాప్తంగా తెలియజేయాలని చాలామది రైతులు ఎన్నికల్లో పోటీకి దిగారు. దీంతో కవితకు దిమ్మతిరిగి బొమ్మ కన్పిస్తోంది.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతుల రూపంలో నేతలకు గట్టి సెగ తుగులుతోంది. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ఉన్న ప్రజాదరణ చూస్తే.. ఆమె విజయం నల్లేరుపై నడకే అని భావించవచ్చు. కానీ ఇక్కడ సిట్యువేషన్ చూస్తే అంత సీన్ లేదు. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికే కవితకు ముచ్చెమటలు పట్టాయి. అందుక్కారణం.. పసుపు, ఎర్రజొన్న రైతులే.

తాము సాగు చేసిన పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నా..పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. అందుకే వారికి తిక్కరేగి ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ స్థాయిలో సమస్యపై చర్చ జరిగేలా చూడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే చాలామంది రైతులు నామినేషన్లను కూడా దాఖలు చేశారు.

రైతుల నామినేషన్లతో ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. అదెలా అంటే, ఒక్కో ఈవీఎం ద్వారా 16 మంది అభ్యర్థుల చొప్పున 4 యూనిట్లను కలుపుకుని 64 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండాలి. ఇంతకంటే ఎక్కువ మంది పోటీ చేస్తే బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. ఇక ఎక్కువ మంది బరిలో నిలిస్తే పరిస్థితి గందరగోళమే. అదే జరిగితే ఆ స్థానంలో ఎన్నికలు వాయిదా వేసే అవకాశం కూడా లేకపోలేదు. టీఆర్‌ఎస్ నేతలకు గుబులు పుట్టిస్తున్న అంశం ఇదే. మొత్తం మీద తమ సమస్యపై కాకరేపి రైతులు ఇప్పటికే 50 శాతం విజయం సాధించారు. ఇంకా ముందు ముందు ఏం చేస్తారో వెయిట్ అండ్ సీ.

Your Comments / Feedback