English Version
  26 Mar, 2019
Home / Latest News / మ‌రోసారి బ్యాలెట్ వ‌ర్సెస్ ఈవీఎం.

మ‌రోసారి బ్యాలెట్ వ‌ర్సెస్ ఈవీఎం.

For Advertisements, Contact here : 8074030036

ఈవీఎంలు… ట్యాంప‌రింగ్ గుర‌వుతున్నాయి. ఈ మాట ప్ర‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లే. నిజానిజాల సంగ‌తి ప‌క్క‌న పెడితే, తెలంగాణ జ‌రిగిన తాజా ఎన్నిక‌లు మ‌రొసారి ఇదే చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. తెలంగాణ‌లో జ‌రిగిన రెండు ఉపాద్యాయ ఎమ్మెల్సీ, ఒక ప‌ట్ట‌బ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. బ్యాలెట్ విధానంలో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో… అధికార పార్టీకి క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌ని ప‌రిస్థితికి దిగ‌జారిపోయింది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవ‌లే…. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి, ఈవీఎంల ద్వారా జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లే కాదు, రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ దే ప్ర‌భంజ‌నం అని అంతా భావించారు. కానీ… బ్యాలెట్ ద్వారా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్ష పార్టీకి, ప్ర‌శ్నించే గొంతుక‌కే ప‌ట్టం క‌ట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

దీంతో… ఈవీఎంల ట్యాంప‌రింగ్ అంశం మ‌రోసారి కీల‌కం అవుతుండ‌గా…. ఎప్ప‌టిలాగే అదికార పార్టీ ట్యాంప‌రింగ్ ఏమీ లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు మాత్రం బ్యాలెట్ ప‌ద్ద‌తి ఎన్నిక‌ల‌కు ప‌ట్టుబ‌డుతున్నాయి. అయితే ఇప్ప‌టికే సుప్రీంలో ఉన్న ప్ర‌తిప‌క్షాల వీవీప్యాట్ లెక్కింపు పిటిష‌న్ పై ఓ తీర్పు వ‌స్తేఈ చ‌ర్చ‌కు పుల్ స్టాప్ ప‌డే అవ‌కాశం క‌న‌పడుతోంది.

Your Comments / Feedback