English Version
  6 Oct, 2017
Home / Politics / ఎర్రబెల్లికి వాళ్లే చెప్పుంటారా!?

ఎర్రబెల్లికి వాళ్లే చెప్పుంటారా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: నిన్నటి వరకు అది వన్ సైడ్ లవ్ అనుకున్నారు! ఇటువైపు నుంచి ‘పొత్తు’ పూలు విసిరారు…అటువైపు నుంచి రెస్పాన్స్ ఉంటుందా అనుకున్నారంతా. కానీ రెస్పాన్స్ రానేవచ్చింది. టీ టీడీపీ సీనియర్లు చేసిన ప్రపోజల్ కు టీఆర్ఎస్ నుంచి ముఖ్యులు గ్రీన్ సిగ్నల్ వేశారు. టీఆర్ఎస్ తో పొత్తుకు అభ్యంతరం లేదంటూ టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రతిపాదనకు టీఆర్ఎస్ నేత, టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. టీ టీడీపీలో ఉన్న ఎల్ రమణ, మోత్కుపల్లి, రావుల లాంటి నేతలంతా టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారని స్పష్టం చేశారు ఎర్రబెల్లి. ఒక్క రేవంత్ మినహా సీనియర్లంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సీనియర్లంతా ఎర్రబెల్లితో తరచూ కలుస్తుంటారు. వీళ్లలో కొందరు నేతలు పేకాట ప్రియులు. దాని కోసం తరచుగా వీళ్లంతా ఒకదగ్గర చేరుతుంటారు. ఆ సందర్భంలో రాజకీయాలు చర్చకు రావడం సహజం. ఆ సందర్భంలో నేతల మనోభావాలు గ్రహించే ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేసుంటారని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ లో ఎర్రబెల్లి కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల వద్ద ఎర్రబెల్లి మాట బాగానే చలామణిఅవుతోంది. ఈ నేపథ్యంలో వారి మనసులో లేకుండానే ఎర్రబెల్లి ఈ కామెంట్స్ చేసి ఉంటారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అదే సమయంలో కేసీఆర్ కు ఆంధ్రాలో మంచి ఫాలోయింగ్ ఉందని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో టీడీపీతో పొత్తు సందర్భంలో ఏపీలో టీడీపీకి ఇబ్బందికలగకుండా ఉండటంలో బాగంగా గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న భావన ఉంది.

Your Comments / Feedback