English Version
  27 Mar, 2019
Home / Entertainment & Reviews / లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏముంది..వర్మ ఏం చూపించబోతున్నాడు

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏముంది..వర్మ ఏం చూపించబోతున్నాడు

For Advertisements, Contact here : 8074030036

ఇప్పుడు అంద‌రి ఫోకస్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పైనే ఉంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం హిట్ అవుతుందా లేదా అనేది పక్క‌న బెడితే అసలు ఈ సినిమాలో ఏముంది..రామ్ గోపాల్ వర్మ ఏం చూపించబోతున్నారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. దానికి తోడు సినిమాలో అన్నీ నిజాలే ఉంటాయి.. నా కెరీర్ మొత్తంలో నేను చేసిన గౌర‌వ‌ప్ర‌ద‌మైన సినిమా ఇదొక్క‌టే.. ఇది తెర‌కెక్కించిన త‌ర్వాత నాకు ఎంతో గ‌ర్వంగా అనిపిస్తుంది అంటూ వ‌ర్మ చెప్ప‌డం కూడా సినిమాపై హైప్ ను మరింత రెట్టింపు చేసింది.

ఇక ఇప్పుడు అన్ని అడ్డంకులు తొల‌గించుకుని మార్చ్ 29న సినిమా రిలీజ్ అవుతుంది. ఒక‌రోజు ముందే యుఎస్ లో భారీగా ప్రీమియ‌ర్స్ కూడా వేస్తున్నారు. క‌చ్చితంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోవ‌డ‌మే కాదు.. అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటుంద‌ని ధీమాగా చెబుతున్నాడు వ‌ర్మ‌. మ‌రోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం ఈ మూవీ రిలీజ్ పై గుర్రుగా ఉన్నారు. సినిమాలో వర్మ ఏం చూపిస్తాడో..తమ పార్టీకి ఎక్కడ మైనస్ అవుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు.

దీంతో జ‌గ‌న్ పార్టీకి అమ్ముడై అబ‌ద్ధాలు చూపిస్తున్నాడంటూ వర్మపై తెలుగు త‌మ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. దాంతో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటి మొద‌లైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు 700 థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుంది. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఓటర్లపై ప్రభావం చూపుతుందా..వ‌ర్మ ఎలాంటి సంచ‌నాలు సృష్టిస్తాడో.. మూవీ రిలీజైతే కాని చెప్పలేం

Your Comments / Feedback