English Version
  1 Mar, 2018
Home / All in one / దేశంలో హ‌స్తం హ‌వా మొద‌లైందా..? వ‌రుస విజ‌యాలు ఏం చెబుతున్నాయ్‌..!

దేశంలో హ‌స్తం హ‌వా మొద‌లైందా..? వ‌రుస విజ‌యాలు ఏం చెబుతున్నాయ్‌..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం:
మోదీ హ‌వా… ఇది మొన్న‌టివ‌ర‌కు బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చింది. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా దేశాన్ని మోదీ మాయాలో ముంచెత్తింది. అయితే ఈ నాలుగేళ్ల పాల‌న‌లో మోదీ చేసిందేమీ లేదు. నోట్ల‌ర‌ద్దు, జీఎస్టీ వాత‌లు త‌ప్పా… జ‌నాల‌కు ఒరిగేందేమీ లేద‌న్న భావ‌న ఏర్ప‌డింది. మాట‌లతో బండి న‌డిపిస్తున్న చాయ్‌వాలాకు చెక్ పెట్టాల‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే ఇపుడు ఆ సీన్ మారింది కాంగ్రెస్ దూసుకొస్తోంది. దేశంలో వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం అనంత‌రం పంజాబ్‌లోని లూథియానాలోనూ అద‌ర‌గొట్టింది. అక్క‌డి మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను స్వీప్ చేసింది. ఇపుడు బీజేపీ అధికారంలో ఉన్న రెండు స్థానాల‌ను కాంగ్రెస్ గెలుచుకోవ‌డంతో ఒక్క‌సారిగా సీన్ మారిన‌ట్లు క‌నిపిస్తోంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగ్గా, ఆ రెంటిని కాంగ్రెస్ దక్కించుకుంది.
కొలారస్‌లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి మహేంద్ర సింగ్‌ యాదవ్‌ ,క ముంగాలి నియోజవకర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బిజేంద్ర సింగ్‌ యాదవ్‌ గెలుపొందారు. ఈ రెండు సీట్లకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించడం వల్లే ఉప ఎన్నికలు జరిగాయి.మద్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలవడం ఆ పార్టీకి ఉత్సాహం ఇచ్చే విషయమే. ఈ విజ‌యాలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపుతున్నాయి.

Your Comments / Feedback