English Version
  25 Mar, 2019
Home / Latest News / కేసీఆర్ ప్లాన్ ను కాపీ కొడుతున్న చంద్రబాబు

కేసీఆర్ ప్లాన్ ను కాపీ కొడుతున్న చంద్రబాబు

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణలో మళ్లీ వేలు పెడుతున్నాడంటూ అసెంబ్లీ ఎన్నికలవేళ చంద్రబాబును ఉతికారేసి.. సిట్యూవేషన్ ను తనకు అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. ఇఫ్పుడు సేమ్ సిట్యువేషన్ ను ఏపీలో ఫాలో అవుతున్నారు చంద్రబాబు..కానీ ఎంతవరకు సక్సెస్ అయితదో చూడాలి..అవును ఇప్పుడు ఏపీ ఎన్నికలు కేసీఆర్ టార్గెట్‌గా సాగుతున్నాయి. వైసీపీకి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంతో… జగన్, కేసీఆర్, నరేంద్రమోదీలను విమర్శిస్తూ చంద్రబాబు తన ప్రచారాన్ని సాగిస్తున్నారు.

చంద్రబాబు తెలంగాణలో వేలు పెట్టడం అటు ప్రజలకు కూడా నచ్చలేదు..దీంతో బాబుకు గట్టి ఝలక్ ఇచ్చారు. అప్పటిలానే ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే… ఏపీ పాలన కేసీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని బాబు అండ్ కో ప్రచారం చేస్తున్నారు. ప్రచారం పతాకస్థాయికి చేరుకున్న వేళ… పవన్ కళ్యాణ్ కూడా ఇదే నినాదాన్ని అందుకోవడం విడ్డూరం. తెలంగాణలో ఆంధ్రావాళ్లపై దాడులు జరుగుతున్నాయనే విధంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్… కేసీఆర్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకొచ్చి ఏపీలో సెంటిమెంట్‌ను రాజేయడం… దాంతో వైసీపీని దెబ్బకొట్టడమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహం. టీడీపీ జనసేన ఎంత మొత్తుకుంటున్న గులాబీ బాస్ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు..ఒకవేళ తాను కౌంటర్ ఇస్తే అది టీడీపీకి ప్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో టీడీపీ ఇంకేం ప్లాన్ వేస్తుందో చూడాలి

Your Comments / Feedback