English Version
  21 Mar, 2019
Home / Latest News / డీకే అరుణ బాటలోనే మరో మాజీ మంత్రి.. పాపం కాంగ్రెస్

డీకే అరుణ బాటలోనే మరో మాజీ మంత్రి.. పాపం కాంగ్రెస్

For Advertisements, Contact here : 8074030036

ఇప్పటికే కారు దెబ్బకు కుదేలయింది కాంగ్రెస్. ఇప్పుడు కమలం పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపడంతో దాని పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. ఇప్పటికే డీకే అరుణని లాగేసిన బీజేపీ..ఇప్పుడు మరో మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విక్టరీ సాధించాలని గట్టిపట్టుతో ఉన్న కమలదళం..ఆ దిశలో ప్రయత్నాలు చేస్తోంది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ బరిలో నిలవడం దాదాపు ఖాయం కాగా..కాంగ్రెస్ మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డిని పార్టీలోకి గుంజేందుకు చర్చలు స్టార్ట్ చేశారు.

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన సునీతా లక్ష్మారెడ్డి… గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేయాలని భావించిన సునితారెడ్డికి హైకమాండ్ నో చెప్పి..ఆ స్థానాన్ని గాలి అనిల్ కుమార్‌కు కేటాయించింది. దీంతో ఆమె కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకోగా.. టీఆర్ఎస్ సైతం ఆమెతో చర్చలు జరిపినా అవి అంతగా సక్సెస్ కాలేవు.

ఇక తాజాగా బీజేపీ నేతలు రంగంలోకి దిగి మెదక్ టికెట్ ఆఫర్ ఇవ్వడంతో ఆమె కమలం కండువా కప్పుకునేందుకు రెడి అయిపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి డీకే అరుణ బాటలోనే సునీతా లక్ష్మారెడ్డి కూడా పయనించడం కాంగ్రెస్ కు మింగుడుపడని అంశం. వరుస దెబ్బలు తట్టుకుని కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి నిలుస్తుందా..లేక చేతులెత్తేస్తుందా చూడాలి.

Your Comments / Feedback