English Version
  26 Sep, 2017
Home / All in one / హలో కొడాలి…జగన్ కు కోపం తెప్పించకు !!

హలో కొడాలి…జగన్ కు కోపం తెప్పించకు !!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: జగన్ తురుపు ముక్క కొడాలి నాని ఓ గమ్మత్తైన విషయం చెప్పారు. చంద్రబాబు, జగన్ ఎంత పవర్ ఫుల్లో తాను అంతే పవర్ ఫుల్ అట! గుడివాడలో తనను ఓడించడం ఎవరి తరమూ కాదని స్వీయ జోస్యం చెప్పుకున్నారు ఈ కొడాలి కోతలరాయుడు. కుప్పంలో చంద్రబాబును, పులివెందులలో జగన్ ను, గుడివాడలో తనను ఓడించడం సాధ్యం కాదని పెద్దోళ్లతో పోలిక కట్టేసుకున్నారు ఈ వైసీపీ చిన్నోడు. తను ఒక్క లెటర్ రాస్తే బాబు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని నంద్యాల ఫలితాల తర్వాత సన్నాయి వాయిద్యాలు మోగించిన నాని ఇప్పుడేంటో బాబు పై కాస్త కరుణ చూపారు. కుప్పంలో బాబునెవరూ ఓడించలేరని ఒప్పేసుకున్నారు. ఆ సంగతి అటుంచితే….ఈ గుడివాడ గడుగ్గాయి తనని తాను మరీ ఎక్కువ ఊహించుకోవడం మాత్రం ముక్కున వేలేసుకోవాల్సిన విషయం. బాబు, తాను ఒకటే నంటే ఫర్వాలేదు. చంద్రబాబు ఏమీ అనుకోడు. ఆయనకు బేషజాలు లేవు. వైఎస్ తో రాజకీయం చేసిన వాడు…ఇప్పుడు ఆయన కొడుకు జగన్ లాంటి జూనియర్ తో పాలిటిక్స్ చేయడానికి మొహమాటపడట్లేదు. ఎటు తిరిగి ఈ పోలిక పై జగన్ ఎలా రియాక్ట్ అవుతాడన్నదే ప్రశ్న. ఎందుకంటే…పెద్ద పెద్ద తోపులే జగన్ సారు ను ‘సార్’ అని సంభోదించాలట. ఈ విషయం చాలా మంది చెప్పినా ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి మరీ మరీ గుర్తు చేశారు. అలాంటి జగనన్నతో నానీ తమ్ముడు సరిసమానం ఎలా అవుతారు? అవుతానని తమ్ముడు అనుకుంటే మాత్రం జగనన్న సహిస్తారా? పొలిటికల్ లోగుట్టు వర్గాల్లో ఇదే ఇప్పుడు చర్చ. ఇక కొసమెరుపు చూస్తే ఉరుములు మెరుపులే! నానీ బాబు తనతో బాబు, జగన్ తో పాటు హరీష్ రావును పోల్చుకున్నారు. సిద్ధిపేటలో హరీష్ ను టచ్ చేసేవాడు లేరట. మరి గజ్వేల్ లో కేసీఆర్, సిరిసిల్లలో కేటీఆర్నో!! నన్నడగొద్దు ప్లీజ్!

Your Comments / Feedback