English Version
  11 Oct, 2017
Home / Latest News / హరీష్ తెగ సిగ్గుపడ్డారు.!

హరీష్ తెగ సిగ్గుపడ్డారు.!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : మంత్రి హరీష్ రావు మొహంలో చాలా కాలం తర్వాత వెలుగు కనిపించింది. మామ కేసీఆర్ పొగుడుతుంటే ఆయన సిగ్గుతో మెలికలు తిరిగారు. సిద్దిపేట కలెక్టరేట్ శంకుస్థాపన శిలాఫలకం వద్దైతే హరీష్ హడావుడి అంతా ఇంత కాదు. కేసీఆర్ సౌకర్యం కోసం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరినీ ఓ ఆర్డర్ లో నిలబెట్టడం కోసం ఆయన నానా హైరానా పడ్డారు. సభ ప్రరంభమయ్యాక…కేసీఆర్ తన ప్రసంగంలో హరీష్ ప్రస్థావన తెచ్చారు. హరీష్ ఈ మధ్య బాగా హుషారయ్యాడన్నారు. ప్రాజెక్టుల పై కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తుంటే మొండిగా నెట్టుకొస్తున్నాడని పొగిడారు. దీంతో హరీష్ ఉబ్బితబ్బిబవడం కనిపించింది. కూర్చున్న సీటులో ముందుకు జరిగి, మెలికలు తిరిగారాయన. చాలా కాలం నుంచి హరీష్ ను కేసీఆర్ పక్కన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మాదిరిగా కీలకమైన సందర్భాలలో హరీష్ కనిపించడం లేదు. పార్టీలో ఆయన బాగా సఫకేషన్ కు లోనవుతున్నారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పొగడటంతో చాలా కాలం తర్వాత హరీష్ ఫేసులో మునుపటి మాదిరి సంతోషం కనిపించింది.

Your Comments / Feedback