English Version
  4 Oct, 2017
Home / Latest News / సైకిల్ ఎక్కిన హరీష్ రావు!

సైకిల్ ఎక్కిన హరీష్ రావు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: టీఆర్ఎస్ కీలక నేత, భారీ నీటిపారుదల శాఖ హరీష్ రావు సైకిల్ ఎక్కారు. కంగారు పడకండి…సైకిల్ ఎక్కడ మంటే టీడీపీలో చేరడం కాదు. నిజంగానే ఆయన సైకిల్ ఎక్కారు. కొంత దూరం దాన్ని తొక్కారు కూడా! సిద్ధిపేటలో లబ్ధిదారులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు హరీష్. ఈ సందర్భంగా చాలా సేపు ఆయన సైకిల్ పట్టుకునే నిలబడ్డారు. చూసేవారెవరికైనా ఆయన సైకిల్ గుర్తు కోసం ప్రచారం చేస్తున్నారా? అన్న భావన కలిగేలా ఆ దృశ్యం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తుకు అభ్యంతరం లేదని టీ టీడీపీ నేత మోత్కుపల్లి ప్రకటించిన విషయం తెలిసిందే. అదే నిజమైతే నిజంగానే హరీష్ కొన్ని నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తును గెలిపించడం కోసం ప్రచారం చేయాల్సి వస్తుందేమో!

Your Comments / Feedback