English Version
  26 Sep, 2017
Home / All in one / సెలవులో సిరిసిల్ల ఎస్పీ!

సెలవులో సిరిసిల్ల ఎస్పీ!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ సెలవుపై వెళుతున్నారు. ట్రైనింగ్ లో భాగంగా ఆయన నెలరోజుల పాటు లడఖ్ కు సెలవుపై వెళుతున్నట్టు సమాచారం. ఒక విధంగా ఆయన పై ఇది వేటు కిందే లెక్క. ఆయన స్థానంలో కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డికి ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల నేరెళ్ల ఘటనతో ఎస్పీ విశ్వజిత్ తీవ్ర వివాదాస్పదుడయ్యారు. దళితుల పై దాడి ఘటనలో నేరుగా ఎస్పీ పాల్గొన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. ఎస్పీ పై వేటుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నేరెళ్లను సందర్శించడంతో ఈ ఘటనకు దేశస్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది. నేరెళ్ల ఘటన పై త్వరలోనే విపక్షాలన్నీ కలిసి పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ సెలవుపై వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Your Comments / Feedback