English Version
  6 Oct, 2017
Home / Latest News / సింగరేణి తండ్రీకూతుళ్లదే!

సింగరేణి తండ్రీకూతుళ్లదే!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : సింగరేణి తిరిగి టీఆర్ఎస్ కైవసం అయింది. మొత్తం 11 స్థానాలలో తొమ్మిది స్థానాలు గెలుచుకుని టీఆర్ఎస్ అనుబంధ విభాగమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అప్రతిహత విజయం సాధించింది. మందమర్రి, భూపాలపల్లి స్థానాలు రెండు మాత్రమే సీపీఐ అనుబంధ విభాగమైన ఏఐటీయూసీ గెలుచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 23,753 ఓట్లు టీబీజీకేఎస్ ఖాతాలో పడ్డాయి. ఏఐటీయూసీకి 19,657 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 4,096 ఓట్ల తేడా ఉంది. కేసీఆర్ కార్మికులను అనేక ప్రలోభాలకు గురి చేసినా 45.67 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగారని, 54.33 శాతం ఓట్లు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పడ్డాయని విపక్షాలు వాదిస్తున్నాయి. ఆరోపణల సంగతి అలా ఉంచితే ఈ విజయం కచ్చితంగా కేసీఆర్, కవితలకే చెందుతుంది. హామీ ఇచ్చినట్టుగా వారసత్వ ఉద్యోగాల సీఎం కేసీఆర్ ఏ విధంగా అమలు చేస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.

Your Comments / Feedback