English Version
  26 Sep, 2017
Home / Politics / షాకింగ్ న్యూస్ చెప్పిన అమిత్ షా!

షాకింగ్ న్యూస్ చెప్పిన అమిత్ షా!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా షాకింగ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ తమకు టచ్ లో లేరని తేల్చేశారు. నిన్నమొన్నటి వరకు టీ కాంగ్రెస్ పై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించిన విషయం తెలిసిందే. టీ కాంగ్రెస్ నేతల ఇళ్లకు తమ ఎంపీ భగవంత్ ఖూబాను పంపి, పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. ఆ ప్రయత్నాలు ఇంకా కొలిక్కిరాలేదు. మధ్యలో లక్ష్మణ్, దత్తాత్రేయ లాంటి వారు తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయని ప్రకటించారు. టీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. తీరా అమిత్ షా ప్రకటన చూస్తే అంతా తుస్సేనా అన్న భావన కలుగుతోంది. ఇంతకీ అమిత్ షా చెప్పినట్టు నిజంగానే టీ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు బీజేపీ పెద్దలతో టచ్ లో లేరా? లేక వ్యూహాత్మకంగానే అమిత్ షా ఈ ప్రకటన చేశారా? అన్న సందేహాలున్నాయి. ఆ విషయం అలా ఉంచితే…వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తు ఉంటుందని షా స్పష్టం చేశారు. అదే సమయంలో విచిత్రంగా తెలంగాణలో మాత్రం ఒంటరిపోరాటమేనని షా తేల్చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో జరిగిన చిట్ చాట్ లో అమిత్ షా ఈ విషయాలు వెళ్లడించారు.

Your Comments / Feedback