English Version
  26 Sep, 2017
Home / Politics / శశిని కొట్టేశారు!

శశిని కొట్టేశారు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం తమిళనాట అన్నాడీఎంకే పార్టీలో రేగిన చిచ్చు మరింత తీవ్రస్థాయికి చేరింది. పార్టీ చీఫ్ పదవి నుంచి వీకే శశికళను బహిష్కరిస్తూ ఆ పార్టీ సోమవారం తీర్మానించింది. శశకళ చేపట్టిన పార్టీ నియామకాలన్నీ రద్దు చేసింది. తమిళనాడులోని రొయపెట్టా వేదికగా సీఎం పళనిస్వామి నేతృత్వంలో సోమవారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శశికళతో పాటు ఆమె మేనల్లుడు టిటివి దినకర్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి బహిష్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. త్వరలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి వీరి బహిష్కరణను అధికారికంగా ఆమోదించనున్నట్టు వెల్లడించారు. తమిళనాట అత్యంత ప్రజాదరణ కలిగిన జయ టివీతో పాటు నమతు ఎంజీఆర్ మేగజైన్‌లను కూడా ఇకపై పార్టీ ద్వారానే నిర్వహించాని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అన్నాడీఎంకేలోని వైరి పక్షాలుగా పేరున్న పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు విలీనం అయిన కొద్ది రోజులకే ఈ తీర్మానాన్ని ఆమోదించడం విశేషం. శశికళ, దినకరన్‌లను పార్టీనుంచి బహిష్కరిస్తేనే పళని వర్గంతో చేతులు కలుపుతామని పన్నీర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పార్టీలోని 23 మంది ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారంటూ దినకరన్ సరికొత్త హైడ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే.

Your Comments / Feedback