English Version
  26 Sep, 2017
Home / Politics / వైసీపీ ఓ తొట్టిగ్యాంగ్!! మనసులో మాట బయటపెట్టిన తెలంగాణ నేత

వైసీపీ ఓ తొట్టిగ్యాంగ్!! మనసులో మాట బయటపెట్టిన తెలంగాణ నేత

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: టీ కాంగ్రెస్ లో ఆయన కీలక నేత. అదృష్టం తన్నుకు వస్తే 2019లో ముఖ్యమంత్రి అవుదామని ఆశలు పెట్టుకున్న నాయకుడు. ఆంధ్రా ప్రధాన ప్రతిపక్షం గురించి సదరు నేత ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఏపీలో ఇక జగన్ అధికారంలోకి రావడం కలే అనిపిస్తోందన్నారు. మీడియాతో ఆఫ్ ది రికార్డు సంభాషణలో ఈ ప్రస్తావన వచ్చింది. నంద్యాల ఫలితాల పై విశ్లేషణ చేసిన సదరు నేత ఏపీలో తమ పార్టీ పరిస్థితి హారిబుల్ గా ఉందన్నారు. లక్షా ఎనభైవేల వరకు ఓట్లు పోలైతే వెయ్యి ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కు రావడం ఏమిటి!? అక్కడ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దీనిని బట్టి అర్థమవుతోందన్నారు సదరు కీలక నేత. పనిలో పనిగా వైసీపీ పై మనసులో మాట బయటపెట్టారు. పరిస్థితి చూస్తే వైసీపీ అధికారంలోకి రావడం కల్లే అనిపిస్తోందన్నారు. అదేమిటి…అలాంటి అభిప్రాయానికి వచ్చారు అని విలేకరులు ప్రశ్నించగా…కాస్త సంశయిస్తూనే ” ఆ పార్టీ ఓ తొట్టిగ్యాంగ్ ను తలపిస్తోంది. ముఖ్యంగా జగన్ కామెంట్స్ దారుణంగా ఉంటున్నాయి. అలాంటి వ్యాఖ్యలను పార్టీ కేడర్ రిసీవ్ చేసుకుంటారు. కానీ, ప్రజలు ఆమోదించరు” అని సదరు ముఖ్యనేత ముక్తాయింపునిచ్చారు.

Your Comments / Feedback