English Version
  26 Sep, 2017
Home / All in one / వైఎస్ ను పంచుకున్నారు!

వైఎస్ ను పంచుకున్నారు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీకి సొంతం? ఆయన వారసత్వం ఎవరి పరం? ఆ మహానేత జయంతి, వర్ధంతుల సందర్భంగా ప్రతిసారి ఈ ప్రశ్న తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా వైఎస్ ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మరోసారి అదే దృశ్యం కనిపించింది. ఆయన కాంగ్రెస్ నాయకుడుగా ఎదిగి, ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినందున ఇరు రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను తమ నాయకుడుగా సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సందర్భంలో ఆయన పాలన, సంక్షేమ పథకాలు, మానవత్వ కోణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఆయన రక్త సంబంధికుడుగా ఉండి, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ను వదిలి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ తానే వైఎస్ కు అసలైన వారసుడుగా చలామణి అవుతున్నారు. కుటుంబ పరంగానే కాదు…రాజకీయపరంగా కూడా వైఎస్ వారుసుడు తానేనన్నది జగన్ క్లెయిమ్. అయితే, రాజకీయంగా వైఎస్ కాంగ్రెస్ మనిషన్నది ఆ పార్టీ నేతలవాదన. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఏపీలో మాత్రం వైఎస్ వారసుడుగా ప్రజలు జగన్ కే పట్టంకట్టారు. రాష్ట్ర విభజన కంటే ముందు జరిగిన ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ స్థానంలో జనం జగన్ కే ఓటేశారు. సాధారణ ఎన్నికల్లో సైతం వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష స్థానం ఇచ్చి వైఎస్ వారసుడు జగనేనని తేల్చారు. ఇక తెలంగాణలో వైసీపీ లేదు కనుక వైఎస్ ఇమేజ్ ను కాస్తోకూస్తో వాడుకునే అవకాశం టీ కాంగ్రెస్ కి ఉంది.

Your Comments / Feedback