English Version
  26 Sep, 2017
Home / All in one / వెంకయ్య కౌన్సెలింగ్ మొదలైపోయింది!!

వెంకయ్య కౌన్సెలింగ్ మొదలైపోయింది!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: వెంకయ్య అవడానికి బీజేపీ నేత అయినా అన్నీ పార్టీల ప్రముఖులకు సన్నిహితుడే. పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలతో ఇష్యూలను డీల్ చేయడంలో ఆయన తీరే వేరు. రాష్ట్ర విభజన సమయంలో సైతం వెంకయ్య నిర్వహించిన మధ్యవర్థిత్వం తక్కువది కాదు. అలాంటి వెంకయ్య ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. ఈ బాధ్యత ఆషామాషీ కాదు. అందరికీ ఆమోదయోగ్యంగా సభను నడపడమంటే అంత తేలికేం కాదన్న పదం సరిపోదు. పార్టీ సభ్యుడుగా ఉన్నప్పుడే అందరివాడుగా పేరు తెచ్చుకున్న వెంకయ్య ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ గా ఎలా వ్యవహరించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. అయితే…ఆయన ఈ బాధ్యతలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారట. సభలో రచ్చ కాకుండా చర్చ జరిగేలా ఆయన కసరత్తు మొదలు పెట్టారట. సభలో అన్నీ పక్షాల ప్రతినిధులను పిలిపించుకుని తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారట వెంకయ్య. సభ సజావుగా జరగాలి, గొడవలు వద్దు, మీ డిమాండ్లకు ప్రాధాన్యత ఉంటుంది, చర్చలు అర్థవంతంగా జరిగేందుకు సహకరించాలని సూచనలు చేస్తున్నారట. తనను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, రావుల వద్ద ఆయన తాను తీసుకుంటోన్న చర్యలను వివరించారట వెంకయ్య.

Your Comments / Feedback