English Version
  9 Oct, 2017
Home / Latest News / వెంకయ్యకు బై చెప్పిన సత్య..!

వెంకయ్యకు బై చెప్పిన సత్య..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓఎస్డీ సత్య తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. సత్య మామూలు జనాలకు తెలియక పోవచ్చును గానీ, రాజకీయ వర్గాల్లో బాగా పాపులర్. ఏ పార్టీ నాయకుడైనా సత్య అనగానే కేరాఫ్ వెంకయ్య అని టక్కున చెప్పేస్తారు. వెంకయ్య వద్ద సత్య గత 24 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి అయ్యే వరకు ఆయనకు పీఏగా సత్య పని చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సత్యను వెంకయ్య తన ఓఎస్డీగా నియమించుకున్నారు. సత్యను రిలీవ్ చేస్తున్నట్టు తన ట్విటర్ ద్వారా వెంకయ్య తెలియజేశారు “సత్య నాతో గడచిన 24 ఏళ్లుగా కలిసి ఉన్నారు. సిన్సియర్…హార్డ్ వర్కర్..నిరంతరం ఓ మిషన్ జీల్ తో తన బాధ్యతలు నిర్వర్తించే వారు. ఆయన ఇక ముందు రాజకీయాలలో పని చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ…తనను రిలీవ్ చేయాల్సిందిగా కోరారు. అతన భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని వెంకయ్య ట్వీట్ చేశారు.

Your Comments / Feedback