English Version
  26 Sep, 2017
Home / Politics / వాళ్లు గులాబీ రజాకార్లు!

వాళ్లు గులాబీ రజాకార్లు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాలలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధునిక రజాకార్లను పంపుతున్నారని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నాటి నిజాం పాలనలో రజాకార్లను ఎలా తరిమికొట్టామో…ఇప్పుడు రైతు సమన్వయ సమితి పేరుతో వచ్చే గులాబీ రజాకార్లను అలాగే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ప్రమేయం లేకుండా జీవో 39 విడుదల చేశారంటే…మంత్రులు ఎంత సన్నాసులుగా మారారో అర్థమవుతోందన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేస్తే తాజాగా కేసీఆర్ నయా పెత్తందారి వ్యవస్థను రైతుల పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంత్రి జూపల్లి కుటుంబం దేవాదాయ భూములు కబ్జా చేస్తే ఇంత వరకు చర్యలు లేవన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టబోయే రైతు సమితులు గ్రామాలలో రాజ్యాంగేతర శక్తులుగా మారబోతున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ లపంగాల ముందు రేపటి నుంచి రైతులు చేతులు కట్టుకుని నిలబడాలా అని ప్రశ్నించారు. జిల్లాల విభజన చేసి 11 నెలలు గడచినా ఈ రోజుకు మ్యాపులు రూపొందించలేకపోయారని…పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. రెండేళ్ల క్రితం గ్రామ జ్యోతి పేరుతో హడావుడి చేశారని, 25 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్భాటపు ప్రకటనలు చేశారని, ఈ రోజుకు ఒక్క పైసా ఇవ్వకపోగా…అసలు ఆ పథకం ఊసే లేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ తర్వాత మన ఊరు – మన ప్రణాళిక అంటూ మరికొంత కాలం కాలక్షేపం చేశారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రూపొందించిన వివరాలలో భూముల వివరాలు కూడా స్పష్టంగా సేకరించారని, తాజాగా మళ్లీ భూ సర్వేల వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రొఫార్మాను ఆయన మీడియాకు విడుదల చేశారు. సీఎం ఉన్మాదంతో కొందరు వ్యక్తులను ఎంచుకుని ఈ సమన్వయ సమితులలో నియమించబోతున్నారన్నారు. ఇది చట్ట విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. జీవో 39 పై పోరాడి రైతుల పక్షాన నిలుస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Your Comments / Feedback