English Version
  13 Oct, 2017
Home / Entertainment & Reviews / వర్మ కోరిక తీర్చిన సోమిరెడ్డి..!

వర్మ కోరిక తీర్చిన సోమిరెడ్డి..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : శివ సినిమా విజయవంతం అయ్యాక డైరెక్టర్ రాంగోపాల్ వర్మను అక్కినేని నాగేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేయమని కోరారట. సినిమాను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలో, ధన్యవాదాలో చెప్పమనేది ఆయన ఇవ్వమన్న ప్రకటన సారాంశం. వర్మ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. నా సినిమా బాగుంది కాబట్టి జనం చూశారు…ఇందులో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నది వర్మ అభిప్రాయం. ఆ తర్విత తెలుగులో ‘గోవింద గోవింద’ , ‘క్షణ క్షణం’ లాంటి సినిమాలు తీశారు వర్మ. వాటేటికీ ఆయన పెద్ద పబ్లిసిటీ కోరుకున్న దాఖలాలు లేవు. సినిమా బాగుంటే జనం చూస్తారు అంతే! దాని ప్రచారం కోసం అసహజమైన దారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సరే ఆ విషయం అలా ఉంచితే…మధ్యలో బాలీవుడ్ కు వెళ్లిపోయిన వర్మ గత నాలుగేళ్ల నుంచి మళ్లీ తెలుగు సినిమా చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడకొచ్చి కొందరు చనిపోయిన నాయకుల ఆటోబయోగ్రఫీలు తెరకెక్కించే పని మొదలు పెట్టారు. రక్తచరిత్ర, వంగవీటి లాంటి అంశాలు తన కథాంశాలుగా తీసుకుంటున్నారు. తాజాగా తాను ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే ఓ వైసీపీ నేత నిర్మాతగా ఈ సినిమా ప్రకటన చేశారు. నిర్మాతను ఎంచుకోవడంలోనే వివాదంతో మొదలు పెట్టారు. ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ టైటిల్ విడుదల చేసి వివాదం మరింత పెంచే ప్రయత్నం చేశారు. సినిమాకు ఎవరిని నిర్మాతగా పెట్టుకోవాలి, టైటిల్ ఏం పెట్టుకోవాలి అన్నది వర్మ ఇష్టం. కానీ, నేతల చరిత్రలు తెరకెక్కించేటప్పుడు కొన్ని లక్షల, కోట్ల మంది అభిమానుల మనోభావాలు ముడిపడి ఉంటాయి. ఈ విషయం వర్మకు తెలియకేం కాదు. వాళ్ల మనోభావాలే వర్మ పబ్లిసిటీకి పెట్టుబడి. సినిమాను ఎంత వివాదం చేస్తే…వాళ్లు అంత రెచ్చిపోతారు. వాళ్ల ఎంత రెచ్చిపోతే అంత ఫ్రీ పబ్లిసిటీ. ఇదేం రహస్యం కాదు. అందరికీ తెలిసిన విషయమే. అయినా, మనోభావాలు కదా! ఈజీగా ట్రాప్ లో పడుతుంటారు. వర్మ కూడా సినిమా పై గతంలో పెట్టినంత దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు. కంటెంట్ ను ఇష్యూ చేసి, బండి నడిపించేస్తే అయిపోతుందనుకుంటున్నాడు. సినిమాలో స్టఫ్ ఉన్నా లేకున్నా కాంట్రవర్సీ పబ్లిసిటీతో పెట్టింది వచ్చేస్తుందన్న భావనలో ఉన్నట్టున్నాడు. అందుకే గతానికి భిన్నంగా తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ లో పబ్లిసిటీ స్టంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. తాజాగా ఆయన స్టంట్ ట్రాప్ లో మంత్రి సోమిరెడ్డి చిక్కారు. ఆ క్రమంలోనే సోమిరెడ్డితో ఎన్టీఆర్ సినిమా పై టీవీ డీబేట్ కు సిద్ధమని వర్మ సవాల్ విసిరారు. మరి సోమిరెడ్డి మరో ట్రాప్ అవుతారా..చూడాలి!

Your Comments / Feedback