English Version
  26 Sep, 2017
Home / All in one / లక్ష్మీ చెబితే వినలేదు!

లక్ష్మీ చెబితే వినలేదు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: మంచులక్ష్మీ చెబితే కేటీఆర్ పెడచెవిన పెట్టారు. ఇప్పుడు పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జూబ్లిహిల్స్ ఫిల్మ్ నగర్ లో ప్రధాన రహదారి పై భారీ గణేష్ మండపం ఏర్పాటు చేశారు. దానికి పావు కిలో మీటర్ ముందు నుంచి కర్రలతో భారీ ఎత్తున స్వాగతం పలుకుతూ కమాన్లు రెండు, మూడు చోట్ల ఆర్గనైజర్లు కమాన్లు నిర్మించారు. దీని కోసం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వారు. వాటిని ఫోటోలు తీసిన నటి మంచులక్ష్మీ వాటిని కేటీఆర్ కు ట్విట్టర్ లో పోస్టు చేశారు. “ఇలా తవ్వేస్తే ఎలా రామ్…యాక్షన్ తీసుకోండి” అని విజ్ఞప్తి చేశారు. అయితే…ఇలాంటి ట్వీట్ల పై యాక్టివ్ గా స్పందించే కేటీఆర్ మంచు లక్ష్మీ ట్వీట్ పై మాత్రం మౌనం దాల్చారు. దేవుడు వ్యవహారం…సెంటిమెంట్ ఇష్యూ కావడంతో ఆయన చూసీచూడనట్టు పోయారు. తాజాగా అది పెను ప్రమాదానికి దారి తీసింది. నగరంలో రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షానికి నానిపోయి కర్రలతో నిర్మించిన ఓ కమాన్ కుప్పకూలింది. ఆ సమయంలో వాహనాలేవి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కమాన్ కూలిపోవడంతో సాయంత్రం ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Your Comments / Feedback