English Version
  26 Sep, 2017
Home / All in one / రేవంత్, పవన్ సేమ్ టు సేమా!?

రేవంత్, పవన్ సేమ్ టు సేమా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కల్యాణ్ వీళ్లిద్దరూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారారు. ప్రతిపక్షంలో వీళిద్దరి స్టైల్ ఒకేలా ఉంది. పేరుకు ప్రతిపక్ష నేతలే అయినా వీళ్లు టచ్ చేస్తే చాలు ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కారమైపోతున్నాయి. తెలంగాణలో అన్యాయం జరిగిందని ఏదైనా వర్గం రేవంత్ రెడ్డిని కలిస్తే చాలు…గుట్టుచప్పుడు కాకుండా ఆ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. తాజాగా ఎస్సై అభ్యర్థుల పరీక్షా ఫలితాలే దీనికి నిదర్శనం. ఎస్సై అభ్యర్థులు రేవంత్ రెడ్డిని కలిసిన సరిగ్గా అయిదో రోజు ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసింది. అంతకు ముందు పది నెలలుగా సదరు అభ్యర్థులు ఎవరిని కలిసి, తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొద్దిరోజుల క్రితం రాజేంద్రనగర్ వెటర్నరీ విద్యార్థుల వ్యవహారంలో ఇలాగే జరిగింది. నెల రోజులు వాళ్లు ధీక్షలు చేసినా ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు. తెలంగాణ వద్దు సమైక్యాంధ్రే ముద్దు అనే స్థాయిలో వాళ్లు బ్యానర్లు కట్టినా ప్రభుత్వం స్పందించలేదు. రేవంత్ రెడ్డి వెళ్లొచ్చిన రెండో రోజే మంత్రి తలసాని అక్కడ వాలిపోయారు. మీ సమస్యలు తీరుస్తాం అని హామీ ఇచ్చివచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూడేళ్లలో రేవంత్ టచ్ చేసిన చాలా విషయాల పై ప్రభుత్వం తక్షణం స్పందిస్తోంది. ఇక ఏపీ విషయంలో పవన్ కల్యాణ్ కూడా సేమ్ టు సేమ్. నిన్నగాక మొన్న ఆయన ఉద్ధానం కిడ్ని సమస్యలపై స్పందించారు. ఆ ప్రాంతంలో పర్యటించారు. అంతే ప్రభుత్వం ఆగమేగాల పై స్పందించింది. ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి సమస్య పరిష్కారం పై దృష్టి పెట్టారు. తాజాగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు జీవో 64 రద్దు కోరుతూ పవన్ ను కలిశారు. వాళ్ల డిమాండ్ లో న్యాయముంది అని పవన్ అనగానే ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసింది. ఇలా రెండు ప్రభుత్వాలు ఆ ఇద్దరు నేతల కనుసన్నలో నడుస్తున్నాయి…కొసమెరుపేమిటంటే…ఏపీలో పవన్ కల్యాణ్ పై సానుకూలతతో ప్రభుత్వం స్పందిస్తుంటే..తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి పై కోపంతో, ఆయనకు ఎక్కడా చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం స్పందిస్తోంది. ఏది ఏమైనా వీరిద్దరి వల్ల కొన్ని సమస్యలైతే పరిష్కారం అవుతున్నాయి. అంత వరకు వారిని అభినందించాల్సిందే!

Your Comments / Feedback