English Version
  13 Oct, 2017
Home / Latest News / రేవంత్ ను సీఎం అభ్యర్థిని చేద్దామన్న నేత ఎవరు..?

రేవంత్ ను సీఎం అభ్యర్థిని చేద్దామన్న నేత ఎవరు..?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : చాలాకాలం తర్వాత టీ టీడీపీ నేతలు ఓపెన్ అయ్యారు. అందరూ ఒక దగ్గర చేరి మనసువిప్పి మాట్లాడుకున్నారు. ఎవరి మనసులో ఏముందో కుండబద్దలు కొట్టారు. ఎక్కడా మొహమాట పడలేదు. పార్టీని బతికించాలో..ముంచేయాలో తేల్చేద్దామన్న స్థాయిలో గొంతులు విప్పారు. టీ టీడీపీ జనరల్ బాడీ సమావేశం తర్వాత జిల్లాల ముఖ్యులతో అగ్రనేతలు భేటీ అయ్యారు. అందులో అందరూ దాదాపు ఒకే స్వరం వినిపించినా భూపాలపల్లి ఇన్ ఛార్జ్ గండ్ర సత్యనారాయణ రావు మిగతావారి కంటే ఒకడుగు ఎక్కువ వేసినట్టు తెలిసింది. ” ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో నాయకత్వం క్లారిటీ లేదు. పార్టీని చంద్రబాబు వదిలేసినట్టుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి జనంలో ఇమేజ్ ఉంది…మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని అధికారికంగా ప్రకటింపజేసుకుని జనంలోకి వెళితే తప్ప పార్టీ నిలబడదు. గత ఎన్నికల్లో కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి అవసరాల మేరకు అలా చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రేవంత్ ను ముందు పెట్టుకుని వెళ్లాల్సిందే” అని గండ్ర కుండబద్దలు కొట్టారట. దాని కంటే ముందు సీనియర్ నేత మోత్కుపల్లి మాట్లాడిన మాటల పై సమావేశంలో అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఓ 20 నియోజకవర్గాలు ఎంపిక చేసుకుని, పని చేసుకుంటే సరిపోతుందని మోత్కుపల్లి వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీనిపై జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసలు పొత్తు ఎవరితో ఉంటుంది? ఆ సీట్లు ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? మీ వరకు సీట్లు వస్తే చాలా? 20 పోతే మిగతా నియోజకవర్గాలలో పార్టీ అవసరం లేదనుకుంటున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించడంతో అగ్రనేతలు మౌనంవహించినట్టు సమాచారం.

Currently has (6) Comments

  • Malu ajmeera on October 14th, 2017 12:35 am

    Next cm revanth reddy

  • balakrishna on October 14th, 2017 3:52 am

    Revanthanna CM

  • Yara sanjeevareddy on October 14th, 2017 4:52 am

    Yes revanth reddy cm

  • sathyam v v nagar division serilingampally constitution on October 14th, 2017 4:52 am

    Revant reddy cm candidate ok

  • గణేష్ రాథోడ్ తెలుగు యువత on October 14th, 2017 5:27 am

    రేవంత్ అన్న కు CM అబ్యర్తి గా ప్రకటిస్తేనే మనకు తెలంగాణలో భవిష్యత్ ఉంటుంది

  • Amer on October 14th, 2017 3:02 pm

    Revanth REDDY CM kavali Telangan Rastanike OK very good thing people wor

Lets write yours comments