English Version
  26 Sep, 2017
Home / Politics / రేవంత్ కు హైకమాండ్ పిలుపు!

రేవంత్ కు హైకమాండ్ పిలుపు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: టీడీపీ-టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హై కమాండ్ నుంచి పిలుపువచ్చింది. అమరావతికి వచ్చి కలవాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కబురు పంపారు. చాలా కాలం నుంచి టీడీపీ తెలంగాణ నేతలపై బాబు శీతకన్ను వేస్తున్నారు. తెలంగాణలో పార్టీని అధినేత పూర్తిగా వదిలేశారన్న భావన నేతల్లో ఉంది. ఇక్కడ పార్టీ సహజ మరణం చెందుతుందేమోనన్న ఆవేదన కొందరు నేతల్లో వ్యక్తమైంది. చంద్రబాబును కలవాలంటే ఒకటికి నాలుగు సార్లు అపాయింట్ మెంట్ అడగాల్సి వస్తోంది. ఆయన కుటుంబం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ నేతలకు పెద్దగా సమయం ఇవ్వడం లేదు. ఎప్పుడు వస్తున్నారో…ఎప్పుడు వెళుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పార్టీకి తెలంగాణలో ఆశాకిరణం రేవంత్ ఒక్కడే. పది మంది లీడర్లు పార్టీలో మిగిలారంటే రేవంత్ ఏదో చేస్తాడన్న నమ్మకంతోనే. అలాంటి రేవంత్ కూడా కొంత కాలంగా లో ఫ్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకు వివిధ వర్గాల పోరుబాటలతో కేడర్ లో వేడి తగ్గకుండా చూసుకున్న రేవంత్ మహానాడు తర్వాత స్లో అయ్యారు. ఆయన వ్యూహాత్మకంగానే వేగం తగ్గించారా…మరేకారణమైనా ఉందా అన్నది తెలియదు. ఈ నేపథ్యంలో రేవంత్ కు చంద్రబాబు నుంచి పిలుపురావడం ఆసక్తిరేకెత్తిస్తోంది. చాలా కీలకమైన విషయాలు ఉంటే తప్ప అధినేత నుంచి పిలుపు రాదన్న భావన ఉంది. విషయం ఏమిటన్నది అటుంచితే…అధినేత పిలుపు మేరకు బుధవారం రేవంత్ అమరావతికి వెళ్లారు.

Your Comments / Feedback