English Version
  26 Sep, 2017
Home / All in one / రేవంత్ ఏమిటో ఆ ఆర్ట్ చెబుతుంది!!

రేవంత్ ఏమిటో ఆ ఆర్ట్ చెబుతుంది!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ‘రూల్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను టీడీపీ టీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న దృశ్యమిది. అయితే…ఈ దృశ్యం నేపథ్యంలో మరో దృశ్యం ఉంది. కాస్త శ్రద్ధగా చూస్తే ఇదే ఫోటోలో ఓ ఆర్ట్ కనిపిస్తుంది. సన్నగా వర్షం పడుతున్న వేళ…రోడ్డు పై ఆటోలు, కార్లు వెళుతుంటాయి. వాటి అవతల సమున్నతంగా తెలంగాణ శాసన సభ భవనం కనిపిస్తుంటుంది. సహజంగా ఎవరికైనా ఇదొక మంచి ఆర్ట్. చిత్రకారుడెవరో అద్భుతంగా గీసారనిపిస్తుంది. అయితే…ఈ ఆర్ట్ వెనుక అంతకు మించి ఆసక్తికరమైన కోణం మరొకటి ఉంది.

ఇది టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి వ్యక్తిత్వానికి, ఆసక్తికి అద్దం పడుతోంది. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎవరికైనా ఆయన కార్యాలయంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. సహజంగా ఎంత పెద్ద నాయకుడు ఇంటికి వెళ్లినా ఇలాంటి దృశ్యాలు కనిపించవు. పార్టీ వ్యవస్థాపకుడి ఫోటోలో, ప్రస్తుతం పార్టీకి నాయకత్వం వహిస్తోన్న నాయకుడుతో తాము దిగిన ఫోటోలో దర్శనమిస్తాయి. రేవంత్ రెడ్డి కార్యాలయంలో సైతం తమ పార్టీ నేతల ఫోటోలు ఉన్నా…అసెంబ్లీ భవన సముదాయాలతో కూడిన ఈ ఆర్ట్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. రాజకీయాలను, రాజకీయ వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను రేవంత్ ఎంతగా ప్రేమిస్తారనడానికి ఈ ఆర్టే నిదర్శనమట. ఎప్పటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలన్న తన కోరికకు ప్రతిభింభంగా ఈ ఆర్ట్ ను తన కార్యాలయంలో ప్రముఖ స్థానంలో ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. వ్యక్తుల కంటే వ్యవస్థలే తనకు ఇన్ స్పిరేషన్ అని రేవంత్ భావిస్తారట. దాని ఫలితమే ఈ అసెంబ్లీ భవనాల సముదాయంతో కూడిన ఆర్ట్ కు ఆయన కార్యాలయంలో అంతటి ప్రాధాన్యత.

Your Comments / Feedback