English Version
  26 Sep, 2017
Home / All in one / రేపటి ‘యాపిల్’ రుచిగా ఉంటుందా..?

రేపటి ‘యాపిల్’ రుచిగా ఉంటుందా..?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ‘యాపిల్’ అభిమానుల ఉత్కంఠకు ఒక్క రోజే మిగిలి ఉంది. ఈ సారి యాపిల్ ఏం చేయబోతోంది? ప్రపంచ గాడ్జెట్ దిగ్గజం యాపిల్ రేపు మార్కెట్ లోకి విడుదల చేయబోతున్న సరికొత్త ఆవిష్కరణలు ఏమిటి? ఇదే ఇప్పుడు యాపిల్ అభిమానుల్లో చర్చ. ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఈ దిగ్గజ సంస్థ నిర్వహించే “యాపిల్ ఈవెంట్” కు సర్వం సిద్ధమైంది. అయితే, ప్రతి ఏడాది నిర్వహించే ఈవెంట్ కు…ఈ సారి జరపబోతున్న ఈవెంట్ కు కనీవినీ ఎరుగని ప్రత్యేకతను చూపబోతోంది యాపిల్ సంస్థ. ప్రతి ఏడూ సెప్టెంబర్ లో యాపిల్ ఈవెంట్ పేరుతో ఓ బిగ్ ఆడిటోరియంలో వివిధ న్యూ గ్యాడ్జెట్స్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే…ఈ సారి ఈ ఈవెంట్ ను యాపిల్ తన సొంత నూతన కార్యాలయంలోనే నిర్వహించబోతోంది. ‘యాపిల్ పార్క్’ పేరుతో సంస్థ కొత్త కార్యాలయాన్ని నిర్మించుకుంది. పెంటగాన్ కంటే ఈ కార్యాలయం పెద్దది. ఇందులో ఏడు వేల చెట్లు పెంచుతున్నారు. 13 బిలియన్ డాలర్లు వెచ్చించి ఈ భవనం కట్టారు. 28 లక్షల స్క్వేర్ ఫీట్లలో ఆఫీసు స్పేస్ ఉంది. 175 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆఫీసు ఉంది. 11 వేల కార్లు పార్క్ చేసుకునే సదుపాయం ఇచ్చారు. ఆఫీస్ లో సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ థియేటర్ పేరుతో నిర్మించిన ఆడిటోరియంలో రేపటి “యాపిల్ ఈవెంట్” జరగబోతోంది. ఈ ఈవెంట్ లో యాపిల్ విడుదల చేయబోతోన్న గ్యాడ్జెట్స్ ఏ తరహాలో ఉండబోతున్నాయి? ఏ సరికొత్త టెక్నాలజీతో ఈ గ్యాడ్జెట్స్ రాబోతున్నాయన్న ఉత్కంఠ ప్రపంచ వ్యాప్తంగా ఉంది.

Your Comments / Feedback