English Version
  26 Sep, 2017
Home / All in one / రెడ్లను గెలుద్దామనేనా!!?

రెడ్లను గెలుద్దామనేనా!!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ఉదయం ప్రధాన పత్రికలను చూస్తే ఆశ్చర్యం వేసింది. రెడ్డి హాస్టల్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయబోతున్నట్టు తెలుగు, ఇంగ్లీషు పత్రికలలో మొదటి పేజీ పూర్తిగా ప్రభుత్వ ప్రకటనలు దర్శనమిచ్చాయి. ఉర్థూ పత్రికలకు కూడా ఇచ్చారేమో తెలియదు. రెడ్డి హాస్టల్ ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వందేళ్ల క్రితమే దాని ప్రస్థానం మొదలైంది. ఎందరో ప్రముఖులను అది ఈ సమాజానికి అందించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు చూస్తే అదేదో ఇప్పుడే మొదలవుతున్నట్టు…కేసీఆర్ మస్థిష్కంలో ఇప్పుడే మొలక మొలిచిన ఆలోచన అన్న భావన కలుగుతోంది. ఇంతకీ ఈ ప్రకటనల వెనుక జరిగిన కథ ఏమిటి? ఇది కేసీఆర్ తనదైన శైలిలో రచించిన వ్యూహం. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గాన్ని దువ్వేందుకు ఆయన వేసిన ఎత్తుగడ. ఇటీవల ఓ టీవీ ఛానల్ లో రెడ్డి సామాజికవర్గం పై జరిపిన చర్చ ఇక్కడ ప్రస్థావించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో జీతభత్యాలు తీసుకుంటున్న నలుగురు నేతలు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణతో పాటు దేశపతి శ్రీనివాస్, వి ప్రకాష్, దేవి ప్రసాద్ కలిసి మూకుమ్మడిగా రెడ్డి సామాజికవర్గం పై దాడి చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెలమలను ఉద్దేశించి ‘మీ జనాభా 0.5’ అన్నందుకే ఈ చర్చలో పాల్గొన్నట్టు వి ప్రకాష్ ఆ తర్వాత ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వెలమ సామాజికవర్గంతో కానీ, నిన్నమొన్నటి వరకు అధికారంలో ఉన్న రెడ్లతో కానీ వీళ్లకు సామాజిక సంబంధం లేదు. అలాంటప్పుడు వెలమలను ఉద్దేశించి ఉత్తమ్ వ్యాఖ్యానిస్తే వీళ్లకు బాధ ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమైంది. ఇది బహిరంగ రహస్యమే…ఆ చర్చ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఏర్పాటైందన్నది సుస్పష్టం. చర్చ అనంతరం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. చర్చలో పాల్గొన్న వారితో పాటు, ప్రభుత్వ పెద్దలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. దాని పర్యవసానమే ఇప్పుడు రెడ్డి హాస్టల్ శంకుస్థాపనకు ఇంత హంగామా! ఓ హాస్టల్ కట్టేసి…పదెకరాలు కేటాయించినంత మాత్రాన రెడ్డి సామాజికవర్గం కేసీఆర్ కు జిందాబాద్ అంటుందనుకుంటే అత్యాశే. ఈ సామాజికవర్గం ఒకప్పుడు ఊళ్లలో పెద్దరికం చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికీ ఆత్మాభిమానం ఎక్కువ. తెలంగాణ సాయుధపోరాటానికి నాయకత్వం వహించిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత రాజ్యాధికారంలో తమదైన ముద్ర వేసిన వర్గం. సమైక్య రాష్ట్రంలో కమ్మలతో రాజ్యాధికార పోరు సాగించిన రెడ్లు…విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి, ప్రత్యర్థి పార్టీలలోని బలమైన రెడ్డి నాయకత్వాన్ని అణచివేసే తీరుతో తమ ప్రత్యర్థి వెలమలేనని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి తమ ఆశాకిరణం పై కేసీఆర్ ప్రయోగించిన కేసులు ఆ సామాజికవర్గ యువతలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఏనాటికైనా రేవంత్ రెడ్డి ఆ స్థాయి నాయకుడవుతారని వారు నమ్ముతున్నారు. అలాంటి నేతను రాజకీయంగా దెబ్బతీసేందుకే కాక వ్యక్తిగతంగా కూడా రేవంత్ పై కేసీఆర్ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వారు నమ్ముతున్నారు. ఇక ఓ వైపు రెడ్డి హాస్టల్ కు శంకుస్థాపన చేసే పేరుతో ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ…మరోవైపు తెలంగాణ సమాజం పెద్దమనిషిగా భావించే కోదండరాంను పట్టుకుని దొంగరెడ్డి అని హోం మంత్రి నాయినితో తిట్టించడం కేసీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనంగా రెడ్లు భావిస్తున్నారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీని తమ వర్గ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న రెడ్లు కేసీఆర్ ను నమ్మడం కల్ల!

Your Comments / Feedback