English Version
  26 Sep, 2017
Home / All in one / రెడ్డిలారా సర్ధుకోండి!

రెడ్డిలారా సర్ధుకోండి!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ ఛానెల్ లో రెడ్డి సామాజికవర్గానికి వ్యతిరేకంగా చర్చా కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కొందరు ప్రముఖులు ఆ చర్చలో పాల్గొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రెడ్డి హాస్టల్ శంకు స్థాపన సందర్భంగా నాయిని స్పందించారు. ఆ చర్చ గురించి బాధపడాల్సిన అవసరం లేదని హితవు పలికారు. రెడ్డి హాస్టల్ కోసం స్థలం కేటాయించాల్సిందిగా ఎంతో మంది సీఎంలను కోరినా పని కాలేదని, కేసీఆర్ ను అడగగానే పదెకరాల భూమి, రూ. పది కోట్లు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ హాస్టల్ కు స్థలం ఇస్తే రాజా బహదూర్ వెంకట్రామి రెడ్డిలా చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కు చెప్పానన్నారు.

Your Comments / Feedback