English Version
  12 Oct, 2017
Home / Latest News / రెడ్డిపోరు ఉద్రిక్తం..!

రెడ్డిపోరు ఉద్రిక్తం..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : మేడ్చల్ లో రెడ్డి జాగృతి నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల లాఠీ ఛార్జ్ తో కొందరు తలలు పగిలాయి. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గాన్ని సమైక్యం చేసే నినాదంతో రెడ్డి జాగృతి నాయకులు అక్టోబర్ రెండున వేములవాడ నుంచి ర్యాలీ మొదలు పెట్టారు. గురువారం ఆ ర్యాలీ మేడ్చల్ కు చేరింది. అక్కడ నుంచి కొంపల్లికి చేరుకుని సాయంత్రం బహిరంగ సభ తలపెట్టాలనుకున్నారు నిర్వాహకులు. అందులో భాగంగా ఆ సామాజికవర్గం ప్రజలు పెద్ద ఎత్తున మేడ్చల్ కు చేరుకున్నారు. ర్యాలీ ప్రారంభమైన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. నిర్వహకులను అదుపులోకి తీసుకుని మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు్ దీంతో జనం స్టేషన్ ముందు బైటాయించారు. నిర్వహకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వాళ్లను చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేశారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి తలలు పగిలాయి. మొత్తంగా ఉద్రిక్తతలో రక్తం చిందింది. ఇటీవల తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ప్రభుత్వం పై అసంతృప్తిగా ఉంది. రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోతున్నామన్న భావన వారిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గ జనం పై లాఠీ చార్జ్…సంఘటన ఉద్రిక్తం కావడం, కొందరికి తలలు పగలడం సీరియస్ ఘటన కిందే లెక్క. ఈ పరిణామం రాజకీయంగా ఎటుదారి తీస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

Your Comments / Feedback