English Version
  7 Oct, 2017
Home / Latest News / రాహుల్ ఫస్ట్ ఇక్కడికే వస్తారట!

రాహుల్ ఫస్ట్ ఇక్కడికే వస్తారట!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పై బాగానే ఫోకస్ పెడుతున్నారు. ఎన్నికలు జరగబోతున్న కర్నాటక కంటే తెలంగాణ పైనే ఆయన మక్కువ పెంచుకున్నట్టున్నారు. అందుకే ఆరు నెలల వ్యవధిలో రెండో సారి తెలంగాణకు వస్తున్నారు. అదేదో మొక్కుబడి లేదా చుట్టపు చూపు పర్యటన కాదు. పబ్లిక్ ఇష్యూల పై ఫైట్ కోసం రాహుల్ వస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడుగా ఈ నెల 25న రాహుల్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆ మరుసటి రోజే ఆయన తెలంగాణలోని మహబూబా బాద్ జిల్లా, డొర్నకల్ నియోజకవర్గం, మరిపెడలో గిరిజన సభలో పాల్గొనబోతున్నారు. ఓ వైపు నల్గొండ ఎన్నికల్లో టీఆర్ఎస్ గిరిజన అభ్యర్థి బాలు నాయక్ ను బరిలోకి దింపబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే గిరిజన వర్గానికి సంబంధించిన సమస్యల పై సభ పెట్టి రాహుల్ ను ఆహ్వానిస్తుండటం గమనార్హం.

Your Comments / Feedback