English Version
  6 Oct, 2017
Home / All in one / యాత్రకు పర్మిషన్ ప్లీజ్!

యాత్రకు పర్మిషన్ ప్లీజ్!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇక ప్రజల మధ్యకు వెళ్లాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికలు తన రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కావడంతో గెలుపునకు సర్వశక్తులు ఒడ్డాలనుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఆరు నెలల పాటు నిత్యం ప్రజల మధ్య ఉండేలా పాదయాత్రకు జగన్ సిద్దమవుతున్నారు. అయితే, పలు ఆర్ధిక నేరాల కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతుండటం తెలిసిన విషయమే. పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత మధ్యలో బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరవ్వాల్సి ఉండటం అసంబద్దంగా ఉంటుంది. అందుకే ఆరు నెలల పాటు శుక్రవారం నాడు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేకుండా మినహాయింపునివ్వాలని ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. వచ్చే వారం అది విచారణకు రాబోతోంది. కోర్టు అనుమతి ఇస్తే సరి. లేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. పాదయాత్ర నుంచి ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి, వెళ్లడం మినహా ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ అదే జరిగినా జగన్ కు సానుభూతి వస్తుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శుక్రవారం హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇస్తే మంచిది. ఇవ్వకపోయినా వచ్చిన ఇబ్బందేమీ ఉండదన్న భావన కొందరు వైసీపీ నేతల్లో ఉంది. పాదయాత్ర నుంచి కోర్టుకు వచ్చిపోవడం కూడా ఓ ప్రచారమేనని వారు భావిస్తున్నారు. నవంబర్ రెండు నుంచి యాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Your Comments / Feedback