English Version
  26 Sep, 2017
Home / Politics / యస్…నేను రె’ఢీ’! రేవంత్

యస్…నేను రె’ఢీ’! రేవంత్

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: రేవంత్ రెడ్డి గర్జించారు. నల్లగొండ ఉప పోరు బరిలో దిగేందుకు సై అన్నారు. కేసీఆర్ తో ‘ఢీ’ కొట్టేందుకు రెడీ అన్నారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ…ఆయన పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు. “ప్రస్తుతం నేను ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ నా సొంత ఊరు కాదు. అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లి మా ఊరు. పార్టీ అధిష్టానం 2009లో కొడంగల్ వెళ్లాలని ఆదేశించింది. అక్కడ ప్రజలు నన్ను ఆదరించారు. ఇప్పుడు కూడా పార్టీ అధినేత, పాలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ, అధ్యక్షుడు ఎల్ రమణ కలిసి నిర్ణయం తీసుకుంటే పార్టీ కోసం పోటీకి నేను రెడీ’ అని రేవంత్ స్పష్టం చేశారు. నల్లగొండ బరిలో రేవంత్ అని “తెలంగాణ పోస్టర్. కాం” నిన్న రాత్రే న్యూస్ బ్రేక్ చేసిన విషయం విదితమే.

Your Comments / Feedback