English Version
  13 Oct, 2017
Home / Latest News / మోడీ పై టీఆర్ఎస్ ఆకస్మిక తిరుగుబాటు!

మోడీ పై టీఆర్ఎస్ ఆకస్మిక తిరుగుబాటు!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : బీజేపీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉన్న టీఆర్ఎస్ అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంది. కారణం తెలియదు కానీ, సడెన్ గా తిరుగుబాటు బావుటా ఎగరేసింది. హైకోర్టు విభజన వంకతో మోడీ పై విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రధాని మోడీకి టీఆర్ఎస్ ఎంపీ, కేసీఆర్ సన్నిహితుడు వినోద్ లేఖ రాసారు. హైకోర్టు విభజనలో జాప్యం పై లేఖలో నిరసన తెలిపారు. లేఖను నిశితంగా పరిశీలిస్తే…నియోజకవర్గాల పునర్ విభజన వ్యవహారాన్నే ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని రాసిన లేఖగా కనిపిస్తోంది. ఇన్నిళ్లూ ప్రతి విషయంలోనూ మోడీ నిర్ణయాలను టీఆర్ఎస్ సమర్ధిస్తోంది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి అసహజ నిర్ణయాలను కేసీఆర్ సమర్ధించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ నిర్ణయాలకు జై కొట్టారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్ రాష్ట్రానికి వస్తే అద్వితీయ ఆతిథ్యం ఇచ్చారు కేసీఆర్. ఉపరాష్ట్రపతి అయ్యాక వెంకయ్యను ఆహ్వానించి ఘన సన్మానంతో సత్కరించారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో కంటి ఆపరేషన్ కోసం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. ఓ దశలో కేబినెట్ లో టీఆర్ఎస్ చేరబోతోందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వినోద్ లేఖ కాస్త ఘాటుగానే కనిపిస్తోంది. నియోజకవర్గాల పెంపు పై ముందడుగు పడకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని వినోద్ తన లేఖలో ఘాటుగా విమర్శించారు. ఈ విషయంలో అటార్నీ జనరల్ ను మరోసారి అభిప్రాయం కోరాలని డిమాండ్ చేశారు. తమ అభిప్రాయం తీసుకోకుండానే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం మోడీ పక్షపాతానికి నిదర్శనమని ఆరోపించారు. మోడీ స్పందించకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కచ్చితంగా నిలదీస్తామన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి పేరుతో కాక ఎంపీ వినోద్ పేరుతో లేఖ రాయడం ఇందులో మరో ట్విస్ట్.

Your Comments / Feedback