English Version
  26 Sep, 2017
Home / Entertainment & Reviews / ముద్దు ఎలా ఉందని అడగాలా !

ముద్దు ఎలా ఉందని అడగాలా !

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విరుచుకుపడ్డారు. వర్మకు సిగ్గులేదని మండిపడ్డారు. అర్జున్ రెడ్డి పేరుతో వస్తోన్న సినిమాలో లిప్ లాక్ సీన్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ సీన్లతో ఆర్టీసీ బస్సుల పై ప్రకటన రూపంలో ఉన్న పోస్టర్లను ఇటీవల వీహెచ్ చించేశారు. యువతను పెడతోవ పట్టించేలా లిప్ లాక్ సీన్లతో పోస్టర్లు వేయడం, సినిమాలు తీయడం పై వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీహెచ్ ఇలా పోస్టర్లు చించి వేయడం పై డైరెక్టర్ వర్మ రెస్పాండ్ అయ్యారు. “వీహెచ్ నీ సినిమా పోస్టర్లు చించి వేస్తే చూస్తూ ఊరుకుంటావా? వెళ్లి వీహెచ్ బట్టలు చించేయ్…అయినా, ఆయన బట్టులు చిరిగిపోతే జనాలు ఎవరూ చూడలేరులే” అంటూ సినిమా హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి ట్వీట్ చేశారు వర్మ. ఈ నేపథ్యంలో వీహెచ్ గురువారం సెన్సార్ బోర్డు ఆఫీసుకు వెళ్లారు. ఇలాంటి సినిమాలకు ఎందుకు అనుమతిస్తున్నారని ఛైర్మన్ ను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్నారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడుతూ వర్మ పై విరుచుకుపడ్డారు. “సినిమా గురించి నా మనవడిని అడగాలని వర్మ అంటున్నారు…ఏమని అడగాలి? ముద్దు బాగుందా అని అడగాలా? వర్మకన్నా సిగ్గుండాలి…నా కన్నా సిగ్గుండాలి. వర్మలాంటి వాళ్ల వల్లే సమాజం చెడిపోతోంది” అని వీహెచ్ మండిపడ్డారు.

Your Comments / Feedback