English Version
  26 Sep, 2017
Home / All in one / మాజీ ఐఎఎస్ చేతుల్లో అడ్డంగా బుక్కయ్యారు!!

మాజీ ఐఎఎస్ చేతుల్లో అడ్డంగా బుక్కయ్యారు!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: ఆయనొక మాజీ ఐఎఎస్ అధికారి. ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకుందామనుకున్నారు. అయితే ఆయన నేపథ్యం తెలియని ఓటర్ల జాబితా నమోదు చేసే సదరు ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించారు. జాబితాలో పేరు చేర్చాలంటే ఉత్తపుణ్యానికి జరగదని….దాని కోసం తమ చేయి తడపాల్సిందేనని మొండిపట్టు పట్టారు. దీంతో ఖంగుతిన్న ఆ మాజీ ఐఎఎస్ అధికారి ఆనందరావు విషయాన్ని ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్ లాల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తులు పని చేస్తున్న ప్రైవేటు ఏజెన్సీతో జీహెచ్ఎంసీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తుల పై జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Your Comments / Feedback