English Version
  26 Sep, 2017
Home / All in one / మహేష్ ఫ్యాన్స్ ఆయన మాట వింటారా!?

మహేష్ ఫ్యాన్స్ ఆయన మాట వింటారా!?

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం: హీరో మహేష్ బాబు ఏ పార్టీ? ఆయన సైకిలెక్కి సవారీ చేస్తారా…? జగన్ కు ఫ్యాన్ గా మారతారా? ఎంపీకి, ఎమ్మెల్యేకి నాకు స్పెల్లింగే రాదన్న మహేష్ సడెన్ గా రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు? పార్టీలో ఎప్పుడు చేరారు అంటారా? అంత సీన్ లేదు! మహేష్ కి అంత ఉబలాటమూ లేదు. కానీ, మహేష్ ప్రమేయం లేకుండానే ఆయనను ఎవరెవరో వాడేసుకుంటున్నారు. ఆ మధ్య సాధారణ ఎన్నికల్లో మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. స్వయానా బావ పోటీ చేస్తుండటంతో సూపర్ స్టార్ కు తప్పలేదు. ఆయన ప్రచార బరిలోకి దిగి, బావను గెలిపించుకున్నారు. ఆ తర్వాత తన పని తాను చేసుకుంటున్నారు మహేష్. అయితే, తాజాగా మహేష్ బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మహేష్ ను వైసీపీలో చేర్చారు. అదీ మహేష్ ప్రమేయం లేకుండానే. నంద్యాల ఎన్నికల్లో మహేష్ ఫ్యాన్స్ అంతా వైసీపీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాజాగా కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆయన ఇదే పాట పాడుతున్నారు. అదేంటి…నాకు రాజకీయాలతో సంబంధం లేదని మహేష్ చెప్పారుగా అని విలేకరులు ప్రశ్నించగా…సమయం వచ్చినప్పుడు చెబుతాడంటూ ముక్తాయింపునిచ్చారు ఈ బాబాయ్. మరి బాబాయ్ అంటించిన ఈ పాలిటిక్స్ బురదను మహేష్ ఎలా కడుక్కుంటారో చూడాలి!

Your Comments / Feedback